అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా విడుదల చేశారు: మీ పేరు చెక్ చేయండి, పేరు లేని వారు 10వ తేదీలోగా ఇలా ఫిర్యాదు చేయండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం జూలై నెలలో ప్రారంభించబోయే ” అన్నదాత సుఖీభవ పథకం 2025 ( annadatha sukhibhava scheme 2025) కు సంబంధించి కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ పథకానికి మీరు అర్హులా కాదా చెక్ చేసుకోవడానికి అధికారికి వెబ్సైట్లో స్టేటస్ లింక్ యాక్టివేట్ చేశారు. ఆ లింకు ఓపెన్ చేసి రైతు యొక్క ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి, ఈ పథకానికి మీరు అర్హులా కాదా అని చెక్ చేసుకోవచ్చు. అర్హులు కాని వారు జూన్ 10వ తేదీలోగా దగ్గర్లోని రైతు సేవా కేంద్రంలో ఉన్న సిబ్బందికి ఫిర్యాదులు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నట్లు వ్యవసాయ డైరెక్టర్ సూచించారు. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి, అర్హత లేని వారు ఫిర్యాదులు ఎలా చేయాలి అనేటువంటి పూర్తి సమాచారం ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులా? కాదా? ఎలా చూసుకోవాలి?:
అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి
- ముందుగా అన్నదాత సుఖీభవ ( Annadata sukhibhava website) వెబ్సైట్లోనికి వెళ్ళండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో ” know your status ” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
- లబ్ధిదారుల యొక్క 12 అంకెల” Aadhar card number” ఎంటర్ చేయండి
- పక్కనే ఉన్న క్యాప్చ కోడ్ కూడా ఎంటర్ చేసి, సబ్మిట్ చేసిన వెంటనే
- స్క్రీన్ పైన లబ్ధిదారుని పేరు,గ్రామం,మండలం,స్టేటస్,eKYC పూర్తి అయిందా లేదా అనేటువంటి పూర్తి వివరాలు చూపిస్తుంది.
- స్టేటస్ లో ‘ eligible” అని ఉంటే ఈ పథకానికి వారు అర్హులు అని అర్థం
- స్టేటస్ లో ‘ ineligible” అని ఉంటే ఈ పథకానికి వారు అర్హులు కాదు అని అర్థం.
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత లేని వారు ఫిర్యాదులు ఎలా సబ్మిట్ చేయాలి?:
అన్నదాత సుఖీభవ పథకం అధికారిక వెబ్సైట్లో స్టేటస్ చెక్ చేసుకున్నాక, మీరు ఈ పథకానికి అర్హులు కాదు అని చూపించినట్లయితే ఈ క్రింది విధంగా మీరుఫిర్యాదులు చేసుకోవాలి.
- అర్హత లేని రైతు సోదరులు ” మీ దగ్గరలోని రైతు సేవ కేంద్రానికి వెళ్లి ” సంబంధిత సిబ్బంది వారికి ఫిర్యాదులు సమర్పించాలి.
- ఫిర్యాదు చేసే సమయంలో లబ్ధిదారుని యొక్క ఆధార్ కార్డ్ నెంబర్,
- eKYC వివరాలు, భూమి యొక్క పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీలు,
- ఇతర కావలసిన వివరాలన్నీ సబ్మిట్ చేసి,
- తాము ఈ పథకానికి అర్హులమని, అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేసి, వారికి కూడా అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు డిపాజిట్ అయ్యేలాగా ఫిర్యాదు చేయాలి.
Anuradha sukhibhava scheme 2025 : official website
ఫిర్యాదులు చేసేందుకు ఆఖరి తేదీ ఏమిటి?
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్న అర్హత లేదు అని వెబ్సైట్లో స్టేటస్ ఉన్న లబ్ధిదారులు ఫిర్యాదులు సమర్పించినందుకు జూన్ 10వ తేదీ వరకు మాత్రమే సమయం ఇచ్చారు. ఆ తేదీలోగా మీరు ఫిర్యాదులను సంబంధిత రైతు సేవ కేంద్రంలోని అధికారులకు సబ్మిట్ చేయవలెను.
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎప్పుడు డిపాజిట్ చేస్తారు?:
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన లబ్ధిదారుల రైతుల అకౌంట్లో మొదటి విడతగా ₹7,000/- ఈ జూలై నెలలోనే డిపాజిట్ చేస్తారు. ఇందులో పీఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5000 రూపాయలు, మొత్తం కలిపి రైతుల ఖాతాలో ₹7000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది.