TTD Food Safety Officer Jobs 2025

తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TTD Food Safety Officer Jobs 2025 తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 10వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

TTD Food Safety Officer Jobs 2025 Overview :

నియామక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం
పోస్టు పేరు సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్
పోస్టుల సంఖ్య 04
జీతం రూ.44,570 – 61,960/-
వయోపరిమితి 42 సంవత్సరాలు
జాబ్ లొకేషన్ తిరుపతి
ఉద్యోగం రకం కాంట్రాక్ట్ పద్ధతి
దరఖాస్తు విధానం ఆఫ్ లైన్

పోస్టుల వివరాలు :

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  • సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ : 01 పోస్టులు
  • ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ : 03 పోస్టులు

అర్హతలు :

TTD Food Safety Officer Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.

పోస్టు పేరు అర్హతలు
సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (అనుభవం అవసరం) ఫుడ్ టెక్నాలజీ / డైరీ టెక్నాలజీ / బయో టెక్నాలజీ / ఆయిల్ టెక్నాలజీ / అగ్రికల్చర్ సైన్స్ / వెటర్నరీ సైన్స్ / బయో కెమిస్ట్రీలలో  బ్యాచిలర్ డిగ్రీ.(లేదా) కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ లేదా మెడిసిన్ లో డిగ్రీ + సంబంధిత ఫీల్డ్ లో 3 సంవత్సరాల అనుభవం
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (అనుభవం అవసరం లేదు) ఫుడ్ టెక్నాలజీ / డైరీ టెక్నాలజీ / బయో టెక్నాలజీ / ఆయిల్ టెక్నాలజీ / అగ్రికల్చర్ సైన్స్ / వెటర్నరీ సైన్స్ / బయో కెమిస్ట్రీలలో  బ్యాచిలర్ డిగ్రీ.(లేదా) కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ లేదా మెడిసిన్ లో డిగ్రీ
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

వయస్సు :

TTD Food Safety Officer Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

TTD Food Safety Officer Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని క్యాటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ:

TTD Food Safety Officer Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం వివరాలు :

TTD Food Safety Officer Jobs 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను 2 సంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల్లో తీసుకుంటారు. ఆ తర్వాత పనితీరు ఆధారంగా టీటీడీ కాంట్రాక్ట్ పొడిగించడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇస్తారు.

  • సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ : రూ.61,960/-
  • ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ : రూ.44,570/-

దరఖాస్తు విధానం :

TTD Food Safety Officer Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

  • అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి.
  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని అవసరమైన పత్రాలతో కింది అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపాలి.
  • అడ్రస్ :అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(COC), సెంట్రలైజ్డ్ అవుట్ సోర్సింగ్ సెల్, TTD అడ్మినిస్ట్రేటివ్్ బిల్డింగ్, కె.టి.రోడ్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్

ముఖ్యమైన తేదీలు  :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 17 జూన్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 10 జూలై, 2025
Notification & Application Click here
Official Website Click here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top