కేంద్రం ఫ్రీగా ఇచ్చే ఈ ‘సూర్య స్టౌ’ ఉంటే వంటకు ఇక గ్యాస్‌తో పనే లేదు – ఇలా అప్లై చేసుకోండి.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘సూర్య స్టౌ‘ పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం – ఉచితంగా సోలార్ కుకింగ్ సిస్టమ్ – ఫ్రీగా అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం
Indoor Solar Cooking System Application : పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అమలు అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, వంటింట్లో మహిళలు గ్యాస్, కట్టెల పొయ్యిల వాడకం వల్ల పొగబారిన పడి ఆస్తమా, ఇతర శ్వాస కోశ వ్యాధులకు గురవుతున్నారు. దాని నుంచి విముక్తి కల్పించడానికి కేంద్రం సంకల్పించింది. అందుకు ‘సూర్య స్టౌ’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.
దీనిద్వారా గ్యాస్ స్టౌకు బదులుగా సౌర శక్తితో వంట చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా దీనివల్ల ఆర్థిక పొదుపు కూడా ఉంటుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా ఈ పథకాన్ని కేంద్రం అభివృద్ధి చేసింది. కానీ క్షేత్రస్థాయిలో దీనిపై గ్రామీణ, పట్టణ ప్రజలకు అవగాహన లేకపోవటంతో పథకం అమలుకు నోచుకోక మరుగున పడుతోందనే విమర్శ వినిపిస్తోంది. ఈ స్టవ్‌ను మహిళలకు ఉచితంగానే అందజేయనున్నారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది.
ఈ పథకంలో లబ్ధి పొందటానికి గృహిణులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే?
- ఇంటర్నెట్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- ఇండియన్ ఆయిల్ బిజినెస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇండోర్ సోలార్ కుక్కర్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- అందులో ఫ్రీ బుకింగ్ ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్ అని కనిపిస్తుంది.
- అక్కడ అడిగిన వివరాలతో పాటు అధార్, పాన్‌కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం సమర్పించాలి.
- అనంతరం సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
- లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తర్వాత మీ దరఖాస్తు సమర్పితం అయినట్లుగా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. దగ్గర్లో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏజెన్సీల ద్వారా ఈ పథకం లబ్ధిదారులకు సేవలు అందుతాయి. దరఖాస్తులకు సంబంధించి వినియోగదారులకు అవగాహన లేకపోవటం, అసలు ఇలాంటి పథకం ఉందన్న దానిపై డీఆర్డీఏ, రెడ్కో యంత్రాంగం అవగాహన కల్పించకపోవటంతో పథకం ద్వారా వినియోగదారులకు అందాల్సిన ప్రయోజనాలు అందటం లేదు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 15 లక్షల కుటుంబాలున్నాయి. ప్రతి నెలా ఒక గ్యాస్‌బండను వినియోగిస్తుంటారు. పల్లె టూరులో అయితే రెండు మూడు నెలలకోమారు వినియోగం ఉంటుంది. పట్టణంలో అయితే నెలకొకసారి గ్యాస్ సిలిండర్ అవసరం ఉంటుంది. జిల్లాలో 5.55 లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీటి ద్వారా ఏడాదికి దాదాపు ఐదు నుంచి 8 సిలెండర్ల చొప్పున వినియోగిస్తుంటారు. సౌరశక్తి స్టౌ పథకం పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే, ఇందులో సగం సొమ్ము ఆయా కుటుంబాలకు పొదుపు అయ్యే అవకాశం ఉంటుంది.
Ok