ఈ యాప్ ఉంటే చాలు – మీ ఊరి వివరాలు మీ చేతుల్లో!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మేరీ పంచాయతీ యాప్ – గ్రామ పంచాయతీల ఆదాయం, ఖర్చుల వివరాలు తెలుసుకునే వీలు – ఇకపై పాలకులు సైతం తప్పులు చేయడానికి అవకాశం లేకుండా యాప్ డిజైన్
Meri Panchayat App : గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులను గ్రామస్థులు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మేరీ పంచాయతీ(నా పంచాయతీ) అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా గ్రామ పంచాయతీల ఆదాయం, ఖర్చుల వివరాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ప్రభుత్వాలు విడుదల చేసే నిధులను పాలకవర్గాలు, ప్రత్యేకాధికారులు ఎలా ఖర్చు చేస్తారనే సమాచారం ఇకపై పంచాయతీ కార్యాలయానికి వెళ్లకుండానే పరిశీలించవచ్చు. ఈ యాప్ 2019 నుంచి మనుగడలో ఉంది. కాని దానికి సంబంధించిన సాంకేతిక కారణాలతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కానీ ఇప్పుడు తాజాగా అన్ని గ్రామాల సమగ్ర సమాచారాన్ని ఈ యాప్‌లోకి తీసుకొచ్చారు.
ఈ యాప్‌లో వివరాల నమోదు సమయంలోనే జీపీఎస్ ద్వారా గుర్తించే అవకాశం ఉంది. ఇతర చోట్ల పనులకు కేటాయించిన నిధులను వినియోగించినా తెలుసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పాలకులు సైతం తప్పులు చేయడానికి అవకాశం ఉండదు. అదికారులు తప్పులు నివేదికలు రూపొందిస్తే ప్రశ్నించడానికి వీలు ఉంటుంది.
యాప్‌పై అవగాహన : మేరీ పంచాయత్ యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామాల్లో చాలా వరకు గ్రామాల్లో చదువుకున్న యువతకు తప్ప మరొకరికి ఈ యాప్ ఉన్నట్లు తెలియదు.
- దీనిని స్మార్ట్‌ఫోన్‌లో ప్లే స్టోర్‌కు వెళ్లి మేరీ పంచాయత్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ కావాలి. వెంటనే ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు, పిన్కోడ్లు ఎంచుకోవాలి. అనంతరం గ్రామపంచాయతీ పూర్తి వివరాలు ఇందులో కనిపిస్తాయి.
- ఈ యాప్ ద్వారా సర్పంచి, కార్యదర్శి, గ్రామ కమిటీలు, ఆస్తుల వివరాలన్నీ దీనిలో తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరం మంజూరు చేసే నిధులు, పనులు ఏ దశలో ఉన్నాయి, దీనికి ఎంత ఖర్చు చేశారన్న వివరాలూ నమోదై ఉంటాయి. నిధుల్లో సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు కూడా యాప్‌లో నమోదు చేస్తారు. వచ్చే సంవత్సరంలో అంచనా వ్యయాల నమోదుతో పాటు గ్రామసభల వివరాలు సైతం అందుబాటులో ఉంటాయి.
- దీనిలో నిధుల వినియోగంలో ఎన్ని లోపాలున్నా, అక్రమాలు జరిగినా తెలుసుకోవడమే కాకుండా సంబంధిత అధికారులను ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని మునగాల ఎంపీడీవో రమేష్ దీన్‌దయాళ్ తెలిపారు.
ఉపయోగాలు :
ఒకేసారి నమోదు :
- ఒకే రిజిస్ట్రేషన్‌తో ఏదైనా గ్రామ పంచాయతీ నుంచి సేవలు పొందవచ్చు
ఎన్నికైన ప్రతినిధులు :
ఎన్నికైన ప్రతినిధులు, పంచాయతీ అధికారులు, సభ్యుల సమాచారాన్ని యాక్సెస్ చేయడం, పారదర్శకతను ప్రోత్సహించడం
గ్రామ పంచాయతీ ప్రొఫైల్ :
- పంచాయతీ స్థాయి
- జనాభా డేటా, మౌలిక సదుపాయాలు సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి సౌకర్యాలను పొందండి
పంచాయతీ ఆడిట్ స్థితి :
- పంచాయతీ ఆడిట్ స్థితిని అందిస్తుంది. అలాగే ఆర్థిక స్థితిని కూడా తెలియజేస్తుంది
పంచాయతీ బడ్జెట్ :
- పంచాయతీ బడ్జెట్ వివరాలు
- దాని కేటాయింపులు, ఆర్థిక వనరులు, ప్రాధాన్యతలపై సమాచారం అందిస్తాయి
Ok
rrsravanmaharaj@gmail.com
Ok👌👌👌🙏🙏🙏