ADVANTAGES OF KISAN CREDIT CARD – APPLY NOW

రైతన్నలకు అద్భుత అవకాశం – కిసాన్​ క్రెడిట్​ కార్డుతో తక్కువ వడ్డీకే రుణాలు! – ఇలా అప్లై చేసేయండి.

రైతులకు కిసాన్క్రెడిట్కార్డులతో అనేక ప్రయోజనాలుకిసాన్క్రెడిట్కార్డుతో విత్తనాలు, పురుగులు మందులు కొనుగోలు చేసినప్పుడు రాయితీలుకేసీసీనిఏటీఎం కార్డుకు అనుసంధానం చేసుకునే అవకాశం.

Advantages Of Kisan Credit Card : రైతన్నలకు మేలు చేకూర్చాలనే సదుద్దేశంతో కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల(కేసీసీ) రుణ పరిమితిని కేంద్రం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినప్పటికీ ఫలితం లేకపోతోంది. ఆశించిన మేర కార్డుల జారీ లేకపోవడంతో అన్నదాతలకు లబ్ధి చేకూరడం లేదు. కిసాన్​ క్రెడిట్​ కార్డు ద్వారా తీసుకున్న లోన్​లకు 7 శాతం వడ్డీ వర్తిస్తుంది. ఇందులో రూ.లక్షలోపు లోన్​లకు 3 శాతం రాయితీని కేంద్రం ఇస్తే 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అంటే రూ.లక్షలోపు లోన్​లకు సున్నావడ్డీ, రూ.లక్ష నుంచి రూ.5 లక్షల్లోపు రుణాలకు సంబంధించి పావలా వడ్డీ ఉంటుంది. కొన్నేళ్లుగా కేంద్రం రాయితీ వర్తింపజేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వక రైతులపై వడ్డీ భారం పడుతోంది.

సంతకాలకే పరిమితం : జగిత్యాల జిల్లాలో 2.95 లక్షల మంది రైతులుండగా 25 వేల కంటే తక్కువ మందికి మాత్రమే కిసాన్​ క్రెడిట్ కార్డులు జారీ చేశారు. రైతులు రుణం తీసుకున్నపుడు బ్యాంకుల్లో కేసీసీ పత్రాలపై సంతకాలు చేసి తీసుకుంటున్నప్పటికీ కార్డులు జారీ చేయడం లేదు.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం :

  • 19-69 ఏళ్ల వయసు వారు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు తీసుకోవడానికి అర్హులు.
  • ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి లేదా నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు వెబ్‌సైట్‌లో అప్లై చేసుకొని కార్డును పొందే వీలుంది.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తును బ్యాంకులో అధికారులు ధ్రువీకరించాల్సి ఉంటుంది.
  • కిసాన్‌ కార్డుకు 5 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది.

కిసాన్క్రెడిట్కార్డు వల్ల ప్రయోజనాలివే : బ్యాంకులో పంట రుణం(క్రాప్​ లోన్​) తీసుకున్నపుడు మంజూరు చేసిన మొత్తాన్ని రైతు పొదుపు అకౌంట్​కు జమ చేస్తారు. అప్పటి నుంచి తిరిగి చెల్లించే వరకు వడ్డీని లెక్కిస్తారు. కానీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డుంటే ఈ అకౌంట్​లోనే పంట రుణం మొత్తం జమవుతుంది. కార్డు ద్వారా ఎన్ని డబ్బులు వినియోగిస్తే అంత మొత్తానికి మాత్రమే వడ్డీ పడుతుంది.

ఏటీఎం కార్డుకు అనుసంధానం : ఇప్పటికే ఏటీఎం కార్డు ఉంటే దాన్ని కిసాన్‌ క్రెడిట్‌కార్డు అకౌంట్​కు లింక్‌ చేయించుకుంటే కార్డును సాధారణ ఏటీఎంగా, కిసాన్‌ క్రెడిట్‌ కార్డుగానూ ఉపయోగించుకోవచ్చు. లావాదేవీలు జరిపినపుడు రెండు అకౌంట్లు కనిపిస్తాయి. ఒకదాన్ని ఎంచుకొని డబ్బు వెచ్చించవచ్చు.

కార్డులతో రాయితీలు : జగిత్యాల జిల్లాలోని 83 వేల పీఎం కిసాన్‌ సమ్మాన్‌ స్కీమ్​ లబ్ధిదారులందరికీ కార్డులు ఇవ్వాల్సి ఉంది. కేసీసీతో ఏడాది పొడవునా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను కొనుగోలు చేసుకోవచ్చు. పీవోఎస్‌(పాయింట్​ ఆఫ్ సేల్​) యంత్రాల ద్వారా కొన్నపుడు రాయితీలు వర్తిస్తాయి. క్రెడిట్‌ కార్డు ద్వారా అదనంగా కేంద్రం నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లోన్​ను పొందవచ్ఛు పావలా వడ్డీ, సురక్ష బీమా యోజన వర్తిస్తాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top