LOCAL PASS IN HIGH WAY TOLL PLAZAS – APPLY NOW

నేషనల్​ హైవేపై ప్రయాణం చేస్తున్నారా? – టోల్‌ ప్లాజా లోకల్ పాస్ గురించి తెలుసుకోండి.

టోల్ ప్లాజా పరిధిలో నివసించే వ్యక్తిగత వాహనదారులకు ప్రభుత్వం లోకల్ పాస్ అనే ప్రత్యేక సౌకర్యంలోకల్పాస్విషయంలో తలెత్తుతున్న సందేహాలకు సమాధానాలు

Local Pass In Toll Plaza : జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే టోల్ రుసుము తప్పదు. కానీ టోల్ ప్లాజా పరిధిలో నివసించే వ్యక్తిగత వాహనదారులకు ప్రభుత్వం లోకల్ పాస్ అనే ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న హైదరాబాద్–విజయవాడ (NH-65), హైదరాబాద్–భూపాలపట్నం (NH-163) జాతీయ రహదారులపై పంతంగి (చౌటుప్పల్), కొర్లపహాడ్ (కేతేపల్లి), గూడూరు (బీబీనగర్) టోల్ ప్లాజాలు ఉన్నాయి.

నెలవారీ లోకల్ పాస్ : ఈ టోల్ ప్లాజాల నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారు, తమ వ్యక్తిగత వాహనాల కోసం నెలవారీ లోకల్ పాస్ తీసుకుంటే, రోజూ ప్రయాణించినా అదనపు టోల్‌ లేకుండా ప్రయాణించవచ్చు. సాధారణంగా లోకల్​ పాస్​ విషయంలో తలెత్తే సందేహాలు, వాటికి సమాధానాలు మీకోసం.

ప్రశ్న : లోకల్ పాస్ అంటే ఏమిటి?

సమాధానం : టోల్ ప్లాజాల చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వ్యక్తిగత వాహనదారులకు (తెలుపు నంబరు ప్లేట్ గల కార్లు) ఎన్ఎచ్ఏఐ ద్వారా జారీ చేసే నెలవారీ ప్రత్యేక అనుమతి పాస్ ఇది. దీనితో నెల మొత్తంలో ఎన్ని సార్లైనా టోల్‌ చెల్లించకుండా రాకపోకలు సాగించవచ్చు.

ప్రశ్న : ఎవరెవరు పాస్ తీసుకోగలరు?

సమాధానం : తమ పేరు మీద రిజిస్టర్ అయిన కార్ యజమానులు మాత్రమే ఈ పాస్‌కు అర్హులు. టోల్ ప్లాజా పరిధిలో 20 కిలోమీటర్లలో నివసించే వారు, తాము అక్కడే నివసిస్తున్నామని ఆధారాలు చూపితే (ఆర్‌సీ, ఆధార్, ఓటర్ ఐడీ) ఈ పాస్ పొందవచ్చు.

ప్రశ్న : ఎప్పుడు, ఎలా దరఖాస్తు చేయాలి?

సమాధానం : ప్రతి నెల మొదటి తేదీ నుంచే పాస్ అమలవుతుంది. టోల్ ప్లాజా కార్యాలయానికి వెళ్లి అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేయాలి. అదేరోజు పాస్ జారీ అవుతుంది. నెల మధ్యలో తీసుకున్నా కూడా అది నెలాఖరుతో ముగుస్తుంది. ఉదాహరణకు, 15వ తేదీన తీసుకున్న పాస్ ఆ నెల 30తోనే ముగుస్తుంది. మిగతా రోజులు వృథా కావచ్చు. అందుకే నెల ప్రారంభంలోనే పాస్ తీసుకోవడం ఉత్తమం.

ప్రశ్న : లోకల్ పాస్ ధర ఎంత?

సమాధానం : ప్రస్తుతం టోల్ ప్లాజాలపై లోకల్ పాస్ ధర సుమారు రూ.350. గతంలో ఇది రూ.380గా ఉండేది. ప్రతి ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1)లో ధరల్లో మార్పులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.

ప్రశ్న : ఫాస్టాగ్లో నైనా పాస్ పని చేస్తుందా?

సమాధానం: టోల్ ప్లాజా నిర్వాహకులు ఏ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారో, ఆ బ్యాంకు ఫాస్టాగ్‌తోనే లోకల్ పాస్ పనిచేస్తుంది. ఉదా: విజయవాడ హైవేపై ఐసీఐసీఐ బ్యాంక్ ఫాస్టాగ్‌ మాత్రమే అనుమతించబడుతోంది. ఇతర బ్యాంకుల ఫాస్టాగ్ ఉన్నవారు కొత్తగా సంబంధిత ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాలి.

ప్రశ్న: వాణిజ్య వాహనాలకు వర్తించదా?

సమాధానం: లోకల్ పాస్ వ్యక్తిగత వాహనాలకు మాత్రమే. వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు. కానీ వారు నెలవారీ వేరే పాస్ తీసుకునే వెసులుబాటు ఉంది. కాకపోతే కమర్షియల్​ వాహనాల కోసం తీసుకునే లోకల్​ పాస్​కు నెలవారీ రుసుము కాస్తా ఎక్కువగా ఉంటుంది.

టిప్ : టోల్ చార్జీలు తగ్గించుకోవాలనుకుంటే టోల్ ప్లాజాలోనే సరైన ఫాస్టాగ్‌ తీసుకోవడం బెస్ట్​ ఆప్షన్​

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top