రేషన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ – కొత్త కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్ – మరి, మీకు కార్డు వస్తోందా? – ఇలా చెక్ చేసుకోండి!
– తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీకి ముహూర్తం ఖరారు – ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు – కొత్తగా 2.4లక్షల మందికి కార్డులు!
New Ration Cards in Telangana: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఏళ్ల తరబడి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారి కల అతి త్వరలో నెరవేరనుంది. ఎందుకంటే కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులు రేషన్ కార్డులు అందుకోనున్నారు. మరి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడు? మీకు కార్డు వచ్చిందో, రాలేదో ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూసేయండి.
కొత్త కార్డుల పంపిణీ అప్పుడే: రేషన్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే ఈ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2.4లక్షల కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా 11.30లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలో గత ఆరు నెలల్లో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసింది. త్వరలో పంపిణీ చేయనున్న వాటితో కలిపితే రేషన్‌కార్డుల సంఖ్య 94 లక్షల వరకు చేరనుంది. మొత్తంగా 3.14కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ కొత్త కార్డులను జులై 14వ తేదీ అంటే సోమవారం నాడు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో నిర్వహించే సభలో లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను అందిస్తారు.
నియోజకవర్గాల్లో అలా: రాష్ట్రవ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కొత్త రేషన్‌కార్డుల మంజూరుతోపాటు పాత కార్డుల్లో కొత్త సభ్యులనూ చేర్చారు. అయితే జులై 14 నుంచి తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు ప్రకటించడంతో చాలా మంది తమకు కొత్త కార్డు వచ్చిందో, రాలేదో అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇంకొందరు స్టేటస్ తెలుసుకునేందురు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే అలాంటి వారు జస్ట్ ఒక్క క్లిక్‌తో రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పాత కార్డుల్లో పేర్లు యాడ్ అయ్యాయో లేదో కూడా తెలుసుకోవచ్చు.
కొత్త కార్డు వచ్చిందో, రాలేదో ఎలా చెక్ చేయాలంటే?:
- మీ ఫోన్లో తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అధికారిక వెబ్సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో ఎడమ వైపు కనిపించే “FSC Search” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్ మీద ‘Ration Card Search’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ‘FSC Search’, ‘FSC Application Search’, ‘Status of Rejected Ration Card Search’ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ‘FSC Application Search’ బటన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ-సేవ అప్లికేషన్ సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది. అందులో జిల్లా సెలెక్ట్ చేసి, ‘Mee Seva No’ బాక్స్‌పై టిక్ చేయాలి.
- ఆ బాక్సులో అప్లికేషన్ సమయంలో మీ సేవ అధికారులు ఇచ్చిన రసీదులోని అప్లికేషన్ నెంబర్‌ను ఎంటర్ చేసి ‘Search’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీ అప్లికేషన్‌కు సంబంధించిన స్టేటస్ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. ‘Apporved’ అని ఉంటే మీకు రేషన్ కార్డు వచ్చినట్లే. ఒకవేళ ‘Pending’ అని ఉంటే మరికొంచెం సమయం పడుతుంది.
పాత రేషన్ కార్డుల్లో కొత్త పేర్లు యాడ్ అయ్యాయో లేదో తెలుసుకునేందుకు :
- తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అధికారిక వెబ్సైట్ ‘https://epds.telangana.gov.in/FoodSecurityAct/’ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో లెఫ్ట్‌సైడ్ కాలమ్‌లో ఉండే “FSC Search” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్ మీద ‘Ration Card Search’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘FSC Search’, ‘FSC Application Search’, ‘Status of Rejected Ration Card Search’ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
- అందులో FSC Search మీద క్లిక్ చేయాలి. ఆ పేజీలో ‘FSC Ref No’ లేదా ‘రేషన్ కార్డ్’ లేదా ‘పాత రేషన్ కార్డ్ నెంబర్’ ఎంటర్ చేసి, జిల్లా సెలెక్ట్ చేసి Search పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్ మీద మీ రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. అందులో పేర్లు యాడ్ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు.
- మీరు మీ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి మీ ఆధార్ నంబర్ చెప్పి కూడా రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు.
Ashwini.lodh