DIBD Recruitment 2025 | Apply Now

డిజిటల్ ఇండియా కార్పొరేషన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

DIBD Recruitment 2025 డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (DIBD) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంగేజ్మెంట్ మేనేజర్లు, ఎకోసిస్టమ్ ఎంగేజ్మెంట్ మేనేజర్లు, టెక్నికల్ సొల్యూషన్స్ మేనేజర్లు మరియు అసిస్టెంట్ మేనేజర్-సోషల్ మీడియా పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియ కాంట్రాక్ట్ / కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జరుగుతుంది. అభ్యర్థులు జులై 10వ తేదీ నుంచి జులై 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి.

పోస్టుల వివరాలు :

డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (DIC) యొక్క స్వతంత్ర వ్యాపార విభాగమైన డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (DIBD) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మేనేజర్ల పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టు పేరు ఖాళీల సంఖ్య జాబ్ లొకేషన్
ఎంగేజ్మెంట్ మేనేజర్ 06 విజయవాడ, భోపాల్, డెహ్రాడూన్, పాట్నా, రాంచీ, రాయ్ పూర్
టెక్నికల్ సొల్యూషన్ మేనేజర్ 03 ఢిల్లీ, నొయిడా
ఎకోసిస్టమ్ ఎంగేజ్మెంట్ మేనేజర్ 04 హైదరాబాద్, కల్ కతా, నార్త్ ఈస్ట్, ఢిల్లీ/నొయిడా
అసిస్టెంట్ మేనేజర్ – సోషల్ మీడియా / ఔట్రీచ్ 01 ఢిల్లీ / నోయిడా

అర్హతలు మరియు అనుభవం :

DIBD Recruitment 2025 పోస్టున బట్టి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింది విధంగా ఉంటాయి.

పోస్టు పేరు అర్హతలు అనుభవం
ఎంగేజ్మెంట్ మేనేజర్ / ఎకోసిస్టమ్ ఎంగేజ్మెంట్ మేనేజర్ పోస్ట్  గ్రాడ్యుయేషన్ తో BE / B.tech / BSc(IT/CS)MBA / M.Tech (ప్రాధాన్యత) ఐటీ సొల్యూషన్ సేల్స్ / కన్సల్టింగ్ లేదా ప్రభుత్వాలు / స్టార్టప్ లలో 5 సంవత్సరాల అనుభవం
టెక్నికల్ సొల్యూషన్స్ మేనేజర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో BE / B.Tech/BSc APIలు, క్లౌడ్-నేటివ్ అప్లికేషన్లు మరియు AI/ML టెక్నాలజీలలో 5 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ మేనేజర్ – సోషల్ మీడియా/ఔట్రీచ్ మీడియా / ఈవెంట్ / క్యాంపెయిన్ మేనేజ్మెంట్ లో 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ మీడియా హౌస్,  గ్రాఫిక్ డిజైన్ సాధనాలు (ఫిగ్మా, కాన్వా) మరియు ప్రభుత్వ కార్యకలాపాలతో అనుభవం ఉండాలి.

వయస్సు :

DIBD Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది.

  • ఎంగేజ్మెంట్ మేనేజర్ / ఎకోసిస్టమ్ ఎంగేజ్మెంట్ మేనేజర్ / టెక్నికల్ సొల్యూషన్స్ మేనేజర్ పోస్టులకు 58 సంవత్సరాల వరకు వయస్సు ఉండాలి.
  • అసిస్టెంట్ మేనేజర్ – సోషల్ మీడియా / ఔట్రీచ్ పోస్టుకు 45 సంవత్సరాల వరకు వయస్సు ఉండాలి.

అప్లికేషన్ ఫీజు :

DIBD Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ:

DIBD Recruitment 2025 పోస్టులకు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  • అప్లికేషన్ స్క్రీనింగ్ : అభ్యర్థుల అర్హతలు, అనుభవం ఆధారంగా అప్లికేషన్లు స్క్రీనింగ్ చేస్తారు.
  • ఇంటర్వ్యూ: స్ట్రీనింగ్ చేయబడ్డ అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.

జీతం వివరాలు :

DIBD Recruitment 2025 పోస్టులకు జీతాలు అభ్యర్థుల అర్హతలు మరియు అనుభవం ఆధారంగా మరియు ఇండస్ట్రీ నిబంధనల ప్రకారం నిర్ణయించబడతాయి.

దరఖాస్తు విధానం :

DIBD Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి.

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
  • DIBD Recruitment 2025 కింద సంబంధిత పోస్ట్ పై క్లిక్ చేయాలి.
  • మొబైల నెంబర్ మరియు ఈమెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • అప్లికేషన్ పారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
  • తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 10 జులై, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 24 జులై, 2025
Engagement Manager Notification Click here
Technical Solution Manager Notification Click here
Ecosystem Engagement Manager Notification Click here
Assistant Manager – Social Media / Outreach Notification Click here
Apply Online Click here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top