Notice to PCS Officer Jyoti Maurya on Estranged Husband’s Maintenance.
నువ్వు మామూలోడివి కాదన్న.. భార్య నుంచి భరణం కోరుతూ కోర్టు మెట్లెక్కిన భర్త..
భార్య..భర్త నుంచి భరణం కోరడం కామన్. కానీ భార్య నుంచి భర్త భరణం కోరడం డిఫరెంట్. అవును ఓ భర్త తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టు మెట్లు ఎక్కాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు భార్యకు నోటీసులు జారీ చేసింది. ఆసక్తిని రేపే ఈ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారతీయ చట్టాలు ఆడవారికే ఎక్కువ అనుకూలంగా ఉంటాయని మగవాళ్లు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. 498ఏ వంటి చట్టాల గురించి ఎన్నో ఏళ్లుగా చర్చ నడుస్తోంది. ఇక విడాకుల విషయానికి వచ్చేసరికి భర్తలకు భరణం అనేది భారంగా మారుతుందనే చర్చ ఎప్పటినుంచో నడుస్తోంది. ఎంతో మంది సంపన్నులు తమ భార్యలకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి విడాకులు తీసుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. అదే సమయంలో భార్యకు భరణం ఇవ్వడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న భర్తలూ ఉన్నారు. కొంతమంది మహిళలు దీనినే ఆయుధంగా చేసుకుని పెళ్లిళ్లు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో ఓ భర్త తన భార్య నుంచి భరణం ఇప్పించాలంటూ కోర్టు మెట్లక్కడం సంచలనంగా మారింది. కింది కోర్టు ఆయన పిటిషన్ కొట్టేయగా.. హైకోర్టును ఆశ్రయించాడు. పీసీఎస్ ఆఫీసర్ జ్యోతి మౌర్య తన భర్త అలోక్ కుమార్ నుంచి విడాకులు కోరింది. ఈ నేపథ్యంలో తన భార్య నుంచి భరణం ఇప్పించాలని అతడు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. ఆ తర్వాత అతడు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు విచారణ చేపట్టి జ్యోతికి నోటీసులు జారీ చేసింది.
అలోక్ 2009లో పంచాయతీ రాజ్ శాఖలో సఫాయి కర్మచారిగా నియమితులయ్యారు. ఆయన 2010లో జ్యోతి మౌర్యను వివాహం చేసుకున్నారు. పెళ్ల తర్వాత భార్య చదువుకుంటానని చెప్పడంతో బాగా చదివించాడు. 2015లో పీసీఎస్ పరీక్షలో ఆమె అర్హత సాధించిన తర్వాత ఎస్డీఎమ్గా బాధ్యతలు చేపట్టింది. అప్పటి నుంచి తనతో పాటు తన కుటుంబం పట్లు ఆమె వైఖరీ మారిందని అలోక్ ఆరోపించాడు. ఆ తర్వాత తన నుంచి విడాకులు కోరిందని వివరించారు. విడాకుల పిటిషన్ పెండింగ్లో ఉన్న సమయంలోనే అలోక్ హిందూ వివాహాల చట్టంలోని సెక్షన్ 24 కింద భరణం కోసం దరఖాస్తు దాఖలు చేశారు. దీనిని ప్రయాగ్రాజ్ కుటుంబ కోర్టు తిరస్కరించింది. దాంతో అతడు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.