TELANGANA CYBER SECURITY BUREAU | BE CAREFUL

 ట్రాఫిక్​ చలాన్​ పేరుతో లింక్స్ వస్తే తొందరపడొద్దు – చేస్తే తప్పదు భారీనష్టం – TELANGANA CYBER SECURITY BUREAU

ట్రాఫిక్చలాన్ల పేరిట ఏపీకే ఫైల్స్పంపుతున్న సైబర్ నేరగాళ్లువాటిని క్లిక్చేయడంతో ఫోన్యాక్సిస్పొందుతున్న కేటుగాళ్లు.

Telangana Cyber Security Bureau Issues Alert Apk File In The Name Of Traffic Challan : ట్రాఫిక్ చలాన్ పేరుతో వస్తున్న నకిలీ apk ఫైల్​తో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ప్రజలకు సూచించారు. చలాన్ పేరుతో వచ్చే సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో “RTO Traffic Challan.apk”అనే పేరుతో వైరల్ మారిందని పోలీసులు గుర్తించారు. ఈ లింక్‌ను క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకునే వారి ఫోన్‌లో రహస్య సమాచారాన్ని సైబర్​ నేరగాళ్లు చోరీ చేసే ప్రమాదం ఉందని పోలీసులు విజ్జప్తి చేశారు.

అనుమానస్పదమైన లింక్స్ : ఈ ఫైల్ ఫేక్ అని, OTP లేదా SMS ద్వారా వినియోగదారులను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని పోలీసుల విచారణలో తేల్చినట్లు తెలిసింది. ఇలాంటి అప్లికేషన్‌లను Google Play Store లేదా Apple App Store నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేయాలని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానాస్పదమైన లింక్స్ గురించి తెలిస్తే వెంటనే 1930 లేదా 8712672222 నంబర్‌లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కోరారు.

TELANGANA CYBER SECURITY
TELANGANA CYBER SECURITY

సాయంత్రం సమయాల్లోనే : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగం గమనించిన వివరాల ప్రకారం సైబర్ నేరగాళ్లు నకిలీ వాట్సాప్​ గ్రూపుల ద్వారా “RTO Traffic Challan.apk” అనే ప్రమాదకరమైన లింక్​ను పంపుతున్నారు. వీటిని ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో మాత్రమే పంపిస్తున్నారు.

నేరం జరిగే విధానంముందుగా apk ఫైల్​ను పంపుతారు. నమ్మదగిన వాట్సాప్​ గ్రూపులలో షేర్​ చేస్తారు. ఆ గ్రూపులో ఉన్న సభ్యులు దానిని నమ్మి ఆలోచించకుండా apk ఫైల్​ను క్లిక్​ చేసి ఇన్​స్టాల్ చేస్తారు. తరువాతి రోజు ఉదయం మీ అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు నుంచి ఆన్​లైన్​లో కొనుగోళ్లు జరిగినట్లు మెసేజ్​లు వస్తాయి.

APK ఫైల్ను మీరు ఇన్స్టాల్చేస్తేఅది మీ SMSలను యాక్సెస్​ చేయగలదు(OTPలను తెలుసుకోవచ్చు). మీ బ్యాంక్​ అకౌంట్​, క్రెడిట్​ కార్డు వివరాలను తెలుసుకోవచ్చు. మీ ఫోన్​ను ఓ రిమోట్​ మాదిరి సైబర్​ నేరగాళ్లు నియంత్రించగలరు.

సైబర్సెక్యూరిటీ పోలీసుల సూచనలుగుర్తు తెలియని, అనధికార లింక్​లను క్లిక్​ చేయకండి. APK ఫైల్స్​ డౌన్​లోడ్​ చేయకండి. Whats App గ్రూపుల్లో షేర్​ చేస్తే వచ్చే మెసేజ్​లను గుడ్డిగా నమ్మకండి. నేరగాళ్లు వాటిని అధికారికంగా ఉన్నట్లే మాయ చేసి వాటిని అలా పెడతారు. యాప్స్​ను ఎల్లప్పుడు గూగుల్​ ప్లే స్టోర్​, యాపిల్​ యాప్​ స్టోర్​ నుంచే డౌన్​లోడ్​ చేయండి. OTP అలర్ట్స్​ను ఎనేబుల్​ చేసుకోండి. ఏవైనా మీ అనుమతి లేకుండా లావాదేవీలు జరిగినట్లు అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే కార్డును బ్లాక్​ చేయండి.

గోల్డెన్ అవర్ : సైబర్​ నేరాల పట్ల ఫిర్యాదు చేయడానికి వెంటనే 1930 కి కాల్​ చేయాలని సైబర్​ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. లేదంటే www.cybercrime.gov.in ద్వారా తెలపాలని సూచించింది. చివరగా గోల్డెన్ అవర్​లో ఫిర్యాదు చేయడం వల్ల మీ డబ్బును సురక్షితంగా కాపాడుకోవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం సైబర్​ సెక్యూరిటీ డైరెక్టర్​ జనరల్​గా శిఖా గోయల్ ఉన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top