NWDA Recruitment 2025 | వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఉద్యోగాలు
NWDA Recruitment 2025 బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్ధ ద్వారా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ(NWDA) మరయు దాని కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జీఐఎస్ ఆపరేటర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 30వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించుకోవాలి.
NWDA Recruitment 2025
పోస్టుల వివరాలు :
నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జీఐఎస్ ఆపరేటర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగంది. మొత్తం 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు లక్నో, భువనేశ్వర్, గ్వాలియర్, వాల్సద్, హైదరాబాద్, చెన్నై, పాట్నా, నాసిక్, న్యూఢిల్లీ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
- డ్రైవర్ : 02
- డీఈఓ : 02
- జీఐఎస్ ఆపరేటర్ : 01
- ఎంటీఎస్ : 11
అర్హతలు :
NWDA Recruitment 2025 పోస్టులను బట్టి విద్యార్హతలు మారుతాయి. వివరాలు కింద ఉన్నాయి.
- డ్రైవర్ : 10వ తరగతి + 3 సంవత్సరాల అనుభవం + డ్రైవింగ్ లైసెన్స్
- డేటా ఎంట్రీ ఆపరేటర్ : 12వ తరగతి + టైపింగ్
- MTS : 10వ తరగతి
- GIS ఆపరేటర్ : గ్రాడ్యుయేట్ + ఆటోకాడ్ లో అనుభవం
అప్లికేషన్ ఫీజు :
NWDA Recruitment 2025 అప్లికేషన్ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. “Broadcast Engineering Consultants India Ltd, Noida” పేరుపై డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.
- ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ అభ్యర్థులకు : ఫీజు లేదు
- ఇతర అన్ని కేటగిరీల అభ్యర్థులకు : రూ.295/-
ఎంపిక ప్రక్రియ:
NWDA Recruitment 2025 అభ్యర్థుల అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ / నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు.
జీతం :
NWDA Recruitment 2025 పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
- జీఐఎస్ ఆపరేటర్ : రూ.25,506/-
- డ్రైవర్ / DEO : రూ.23,218 – రూ.25,506/-
- ఎంటీఎస్ : రూ.16,432 – రూ.23,218/-
దరఖాస్తు విధానం :
NWDA Recruitment 2025 పోస్టులకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు మరియు డిమాండ్ డ్రాఫ్ట్ జత చేయాలి.
- పూర్తి చేసిన అప్లికేషన్ ని స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది చిరునామాకు పంపాలి.
- చిరునామా: బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్(BECIL), BECIL భవన్, C-56/A-17, సెక్టార్-62, నోయిడా-201307(యూపీ)
కావాల్సిన పత్రాలు:
- పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
- 10వ తరగతి / 12వ తరగతి సర్టిఫికెట్
- గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్
- పని అనుభవం ధ్రువీకరణ పత్రం
- పాన్ కార్డు
- ఆధార్ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రం(వర్తిస్తే)
- ఈపీఎఫ్/ESIC కార్డ్ (ఏదైనా ఉంటే)
- బ్యాంక్ పాస్ బుక్
- డిమాండ్ డ్రాఫ్ట్
దరఖాస్తులకు చివరి తేదీ : 30.07.2025
Notification & Application | Click here |