AP Anganwadi Jobs 2025 | Apply Now

AP Anganwadi Jobs 2025: టీచర్ & హెల్పర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్… అప్లై చేయండి.

AP Anganwadi Jobs 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ICDS, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో AP Anganwadi Teacher & Helper Jobs 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నెల్లూరు జిల్లాతో సహా ఇతర జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టుల కోసం అర్హత కలిగిన వివాహిత మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పరీక్ష లేకుండా, మీ గ్రామంలోనే ప్రభుత్వ ఉద్యోగ అవకాశం పొందండి!

AP Anganwadi Jobs 2025 నోటిఫికేషన్ వివరాలు

అంశం వివరాలు
పరీక్ష/ఉద్యోగం పేరు AP Anganwadi Teacher & Helper
నోటిఫికేషన్ తేదీ 05-08-2025
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 05-08-2025
దరఖాస్తు చివరి తేదీ 26-08-2025
ఫలితాల తేదీ To be announced

ఖాళీల వివరాలు

పోస్టు పేరు ఖాళీల సంఖ్య జిల్లాలు
అంగన్‌వాడీ టీచర్ 28 నెల్లూరు & ఇతర జిల్లాలు
అంగన్‌వాడీ హెల్పర్ 168 నెల్లూరు & ఇతర జిల్లాలు

అర్హతలు

అంశం వివరాలు
విద్యార్హత 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత
వయస్సు 01-07-2025 నాటికి 21-35 సంవత్సరాలు కలిగి ఉండాలి
ఇతర అర్హతలు కేవలం వివాహిత మహిళలు, స్థానిక గ్రామ నివాసులు అయి ఉండాలి
రిజర్వేషన్ SC/ST ప్రాంతాల్లో సంబంధిత కులానికి ప్రాధాన్యత

దరఖాస్తు ఫీజు

ఈ నోటిఫికేషన్ కోసం ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం

  • రాత పరీక్ష లేదు.
  • రిజర్వేషన్ రోస్టర్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.
  • స్థానికత, విద్యార్హతలు, వయస్సు ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
  • ఎంపికైన వారి జాబితా గ్రామ/వార్డు సచివాలయం నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు.

AP Anganwadi Jobs 2025 కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

  1. అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేయండిApplication PDF Click Here.
  2. ఫారాన్ని సరిగా నింపి, అవసరమైన డాక్యుమెంట్లను జత చేయండి.
  3. డాక్యుమెంట్లు: 10వ తరగతి మార్క్ షీట్, కుల ధృవీకరణ, నివాస ధృవీకరణ, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, వితంతువైతే మరణ ధృవీకరణ, PH సర్టిఫికేట్ (వర్తిస్తే) జత చెయ్యాలి.
  4. మీ మండలంలోనిICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో ఆగస్టు 26, 2025 సాయంత్రం 5:00 లోపు సమర్పించండి.

ముఖ్యమైన లింకులు

వివరణ లింకు
అప్లికేషన్ ఫారం Get Application
అధికారిక వెబ్‌సైట్ https://spsnellore.ap.gov.in/

తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

ఉద్యోగాల కోసం పరీక్ష ఉంటుందా?

లేదు, ఎంపిక రిజర్వేషన్ & మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

ఇతర జిల్లాల నుండి అప్లై చేయవచ్చా?

కేవలం మీ గ్రామానికి సంబంధించిన పోస్టులకు మాత్రమే అప్లై చేయవచ్చు.

అవివాహిత మహిళలు అర్హులా?

లేదు, కేవలం వివాహిత మహిళలకు మాత్రమే అర్హలు.

అప్లికేషన్ ఫీజు ఉందా?

లేదు, ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక జాబితా ఎక్కడ చూడవచ్చు?

గ్రామ/వార్డు సచివాలయం నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top