ట్రంప్ ఆంక్షలకు రియాక్షన్- అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేసిన భారత్ – INDIA SUSPEND POSTAL SERVIES US
అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సర్వీసులు నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం
India Suspend Postal Servies US : భారత్‌పై సుంకాల యుద్ధానికి దిగిన అమెరికాపై కేంద్రం ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికాకు పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా కొత్త నిబంధనలు కారణంగా ఆ దేశానికి వెళ్లే అన్ని రకాల పోస్టల్ వస్తువులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు తపాలా శాఖ వెల్లడించింది. ఆగస్టు 25 నుంచి అమలల్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.
800 డాలర్ల విలువైన వస్తువులపై సుంకాల మినహాయింపును ఉపసంహరించనున్నట్లు జులై 30న యూఎస్ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేసింది. అది ఆగస్టు 29 నుంచే అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, 100 డాలర్ల వరకు విలువైన బహుమతి వస్తువులపై సుంకాల మినహాయింపు కొనసాగుతుందని పేర్కొన్నాయి. కాగా, ఆగస్టు 15న సీబీపీ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ క్వాలిఫైడ్ పార్టీలు గుర్తింపు ప్రక్రియ, అలాగే సుంక వసూలు, చెల్లింపు విధానంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో అమెరికాకు వెళ్లే విమానయాన సంస్థలు ఆగస్టు 25 తర్వాత పోస్టల్ పార్శిల్స్‌ను తీసుకెళ్లేందుకు నిరాకరించాయి. ఈ నేపథ్యంలోనే తపాలా శాఖ ఆగస్టు 25 నుంచి అమెరికాకు వెళ్లే అన్ని రకాల పోస్టల్ సేవలను తాత్కాలింకగా నిలిపివేస్తున్నట్లు నిర్ణయించింది.
అయితే, ఇప్పటికే పార్శిల్లను బుక్ చేసుకొని ఉంటే ఆందోళ చెందాల్సిన అవసరం తపాలా శాఖ పేర్కొంది. ఇప్పుడు పంపలేని పార్శిల్‌కు పోస్టేజ్ రీఫండ్ ఇస్తామని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. వీలైనంత త్వరగా పూర్తి సేవలను తిరిగి ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఇక రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు అదనపు సుంకాలు విధించారు. ఆగస్టు 27 నుంచి 50శాతం సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో వీటి గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో ఇప్పటికే పేర్కొన్నారు. గతంలో ట్రంప్ ప్రకటించినట్లుగా వచ్చే వారం కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు.