Do you have the habit of leaving mobile charger plugged in?

Do you have the habit of leaving your mobile charger plugged in?

మొబైల్‌ చార్జర్‌ను ప్లగ్ ఇన్ చేసి వదిలేసే అలవాటు మీకూ ఉందా? ఐతే ఏ క్షణమైనా మీ కొంప ఢమాల్..

చాలా మంది తమ ఫోన్‌లకు ఛార్జింగ్ పెట్టి బ్యాటరీ ఫుల్‌ అయిన తర్వాత ఫోన్‌ తీసుకుంటారే.. కానీ ఛార్జర్‌ను ప్లగిన్ చేసి అలాగే ఉంచుతారు. కానీ అలా చేయడం సరైనదేనా? ఛార్జర్ అలా వదిలేస్తే దాంట్లో విద్యుత్తు ప్రవహిస్తుందా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం..

నేటి జీవిన విధానంలో మొబైల్ ఫోన్లు కూడా మన జీవితంలో ఓ భాగమై పోయాయి. ఇతర పనులు, వస్తువుల మాదిరిగానే ప్రతి ఒక్కరికీ ఫోన్లు, మొబైల్స్ ముఖ్యమైపోయాయి. వినోదం మాత్రమే కాదు అనేక ఇతర ముఖ్యమైన పనులు కూడా ఫోన్ల ద్వారా జరుగుతున్నాయి. అయితే ఫోన్ ఎంత ముఖ్యమో దానికి ఛార్జర్ కూడా అంతే ముఖ్యం. ఫోన్ నడుస్తూ ఉండటానికి తరచూ ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. అయితే చాలా మంది తమ ఫోన్‌లకు ఛార్జింగ్ పెట్టి బ్యాటరీ ఫుల్‌ అయిన తర్వాత ఫోన్‌ తీసుకుంటారే.. కానీ ఛార్జర్‌ను ప్లగిన్ చేసి అలాగే ఉంచుతారు. కానీ అలా చేయడం సరైనదేనా? ఛార్జర్ అలా వదిలేస్తే దాంట్లో విద్యుత్తు ప్రవహిస్తుందా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం..

ఉపయోగంలో లేనప్పుడు కొంతమంది తమ ఛార్జర్‌లను అన్‌ప్లగ్ చేస్తారు. కానీ చాలా మంది వాటిని ప్లగ్ ఇన్ చేసి అలాగే వదిలేస్తారు. ఎనర్జీ సేవింగ్ ట్రస్ట్ ప్రకారం.. ఏదైనా స్విచ్ ఆన్ చేసిన ఛార్జర్ ప్లగ్ ఇన్ చేయబడినప్పుడు అది విద్యుత్తును ఉపయోగిస్తూనే ఉంటుంది. మీ ఫోన్‌ దానికి కనెక్ట్ చేయబడినా, చేయకపోయినా విద్యుత్తు ఉపయోగంలోనే ఉంటుంది. ఇది కొన్ని యూనిట్ల విద్యుత్తును వృధా చేయడమే కాకుండా క్రమంగా ఛార్జర్ జీవితకాలాన్ని తగ్గిస్తుంది.

ఛార్జర్‌ను ప్లగిన్ చేసి ఉంచితే, అది విద్యుత్‌ను వినియోగిస్తూనే ఉంటుంది. దీనిని ‘స్టాండ్‌బై పవర్’ అంటారు. దీని అర్థం పరికరానికి కనెక్ట్ చేయబడినా, చేయకపోయినా ఛార్జర్ కొంత విద్యుత్‌ను వినియోగిస్తూనే ఉంటుంది. దీనివల్ల చాలా విద్యుత్ వృధా అవుతుంది. ఛార్జర్‌ను ఎక్కువసేపు ప్లగిన్ చేసి ఉంచడం వల్ల అది వేడెక్కడం, సాకెట్ కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ జరగడం వంటివి సంభవిస్తాయి. అంతేకాకుండా ప్లగ్-ఇన్ ఛార్జర్ అంతర్గత భాగాలు వేడెక్కుతూనే ఉంటాయి. ఇది దాని భాగాలను దెబ్బతీస్తుంది. ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరగడానికి కూడా కారణం అవుతుంది. కొన్నిసార్లు వోల్టేజ్ పెరుగుదల కారణంగా ఛార్జర్ కూడా పేలిపోవచ్చు. అందువల్ల మొబైల్‌ను ఛార్జ్ చేసిన తర్వాత, ఛార్జర్‌ను ఛార్జింగ్ పాయింట్ నుంచి తీసివేయడం మంచిది. మీకూ ఛార్జర్‌ను అన్‌ప్లగ్ చేయకుండా ఉంచడం అలవాటు చేసుకుంటే వెంటనే మానుకోవడం మంచిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top