Do you have the habit of eating chips? hair will fall out.

Do you also have the habit of eating chips? But soon your hair will start to fall out.

Premature Greying Hair: చిప్స్ తినే అలవాటు మీకూ ఉందా? అయితే త్వరలోనే మీ జుట్టు గోవిందా..

ఒకప్పుడు వయసు మీద పడిన వారికి మాత్రమే జుట్టు తెల్లబడేది. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు. సమస్య యువతలో అధికంగా కనిపిస్తుంది. ఇక బయటకు వెళ్లేవారికి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా చిన్నతనంలోనే జుట్టు నెరియడానికి కారణం ఏమిటో మీరెప్పుడైనా ఆలోచించారా?

నేటి కాలంలో చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు నెరిసిపోతుంది. ఒకప్పుడు వయసు మీద పడిన వారికి మాత్రమే జుట్టు తెల్లబడేది. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు. ఈ సమస్య యువతలో అధికంగా కనిపిస్తుంది. ఇక బయటకు వెళ్లేవారికి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా చిన్నతనంలోనే జుట్టు నెరియడానికి కారణం ఏమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు ఈ రకమైన సమస్యకు కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మద్యం వినియోగం

చిన్న వయసులోనే సహజంగా నల్లగా ఉండే జుట్టు.. క్రమంగా తెల్లగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మద్యం సేవించడం. అధికంగా మద్యం సేవించడం వల్ల ఎక్కువగా తాగే వారి ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా, వారి జుట్టు కూడా తెల్లగా మారుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ప్యాక్ చేసిన ఆహారాలు

అతిగా ఆల్కహాల్ తీసుకోవడమే కాకుండా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి కారణమవుతుంది.

టీ – కాఫీ తాగడం

రోజూ టీ, కాఫీ తీసుకోవడం సర్వసాధారణం. కానీ పరిమితికి మించి ఎక్కువగా టీ, కాఫీ తాగే వారికి జుట్టు తెల్లబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటిలోని కెఫిన్ శరీరం పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తుంది. ఫలితంగా జుట్టు బూడిద రంగులోకి మారుతుంది.

వేయించిన ఆహారం

ఈ రోజుల్లో వేయించిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం అలవాటై పోయింది. కానీ మీకు తెలుసా? మనం తినడానికి ఇష్టపడే వేయించిన ఆహారాలలో ఎక్కువ పోషకాలు ఉండవు. వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు లోపానికి దారితీయవచ్చు. దీనివల్ల జుట్టు తెల్లబడవచ్చు. కాబట్టి వీలైనంత వరకు అలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

ఉప్పు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు అస్సలొద్దు

అదేవిధంగా ఉప్పు, చక్కెరతో తయారు చేసిన ఆహారాలను తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతే కాదు ఇది జుట్టు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అధికంగా తీసుకుంటే తలపై నల్లటి జుట్టంతా తెల్లగా మారే ప్రమాదం ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top