the post office,17 lakhs profit with a low investment.

A scheme that will blow you away at the post office.. Rs. 17 lakhs in your hand with a low investment..

Post Office: పోస్టాఫీస్‌లో అదిరిపోయే స్కీమ్.. తక్కువ పెట్టుబడితో చేతికి రూ.17లక్షలు..

మధ్య చాలా మంది పోస్టాఫీస్ పథకాల వైపు మళ్లుతున్నారు. దీనికి ప్రధాన కారణం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం, ప్రభుత్వం హామీ ఉండడమే. అలాంటిదే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. స్కీమ్‌లో తక్కువ పెట్టుబడితో రూ.17లక్షల ఆదాయం అర్జించవచ్చు.

ప్రతి ఒక్కరూ తమ కష్టార్జితంతో మంచి ఆదాయం పొందాలని కోరుకుంటారు. ముఖ్యంగా భవిష్యత్తు అవసరాలైన పిల్లల చదువులు, పెళ్లిళ్లు లేదా ఇతర ఆర్థిక లక్ష్యాల కోసం పెద్ద మొత్తంలో నిధిని కూటబెట్టడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం ఒక గొప్ప నమ్మదగిన పెట్టుబడి మార్గంగా నిలుస్తోంది. ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా క్రమం తప్పకుండా పొదుపు చేసేవారికి ఈ పథకం బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.  పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో చాలామంది సురక్షితమైన, స్థిరమైన పెట్టుబడుల కోసం అన్వేషిస్తున్నారు. ఈ కోవలో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం ప్రజలను ఆకర్షిస్తోంది. ఇది ప్రభుత్వ హామీతో కూడిన పథకం కాబట్టి ఇందులో పెట్టుబడులకు ఎటువంటి మార్కెట్ రిస్క్ ఉండదు.

పథకం వివరాలు

ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ RD పథకం 6.7శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారు అంటే మీరు వడ్డీపై కూడా వడ్డీని సంపాదిస్తారు. ఈ పథకంలో ప్రతి నెలా ఒక స్థిరమైన మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. కేవలం రూ.100 తో RD ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్ట డిపాజిట్‌కు ఎటువంటి పరిమితి లేదు.

17 లక్షల నిధిని ఎలా పొందవచ్చు?

క్రమంగా పొదుపు చేసే అలవాటు ఉన్నవారికి ఈ పథకం ఒక గొప్ప వరం. మీరు ప్రతి నెలా రూ.10,000 చొప్పున పెట్టుబడి పెడితే.. 5 ఏళ్లకు మీరు మొత్తం రూ.6 లక్షలు పెట్టుబడి పెడతారు. దానిపై వచ్చే వడ్డీతో కలిపి మీకు దాదాపు రూ.7,13,659 లభిస్తుంది. అంటే రూ.1.13 లక్షల లాభం వస్తుంది. అదే 10 ఏళ్లకు మీ పెట్టుబడి మొత్తం రూ.12 లక్షలు అవుతుంది. కానీ చక్రవడ్డీ వల్ల మీ మొత్తం నిధి దాదాపు రూ.17,08,546 కు పెరుగుతుంది. అంటే మీరు అదనంగా రూ.5 లక్షలకు పైగా లాభం పొందుతారు. ఈ పథకం ముఖ్యంగా తక్కువ రిస్క్ కోరుకునే, దీర్ఘకాలికంగా నిధిని నిర్మించుకోవాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

ఖాతా ఎలా తెరవాలి..?

RD ఖాతాను తెరవడం చాలా సులభం. 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా వారి తల్లిదండ్రులతో కలిసి ఖాతా తెరవవచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత కొత్త కేవైసీ ఫామ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకం గడువు 5 ఏళ్లు. మీరు కోరుకుంటే గడువు ముగిసిన తర్వాత ఖాతాను మరో 5ఏళ్లు పొడిగించుకోవచ్చు. ఒకవేళ అవసరం ఏర్పడితే 3 సంవత్సరాల తర్వాత ఖాతాను మూసివేయడానికి కూడా అవకాశం ఉంది. ఖాతాదారుడు మరణిస్తే నామినీ నిధులను విత్ డ్రా చేసుకోవచ్చు లేదా ఖాతాను కొనసాగించవచ్చు. ఈ సరళమైన, సురక్షితమైన పెట్టుబడి విధానం ఆర్థికంగా భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top