Is your mop dirty and greasy? Make it shine with these

Is you mop dirty and greasy? Make it shine with these simple tips.

Kitchen Hacks: మీ మాప్ మురికిగా, జిడ్డు కారుతూ ఉందా.. ఈ సింపుల్ టిప్స్ తో తళతళలా మెరిపించండి..

ఆధునిక యుగంలో ఇంటి నిర్మాణంలో కూడా ఎన్నో హంగులు వచ్చాయి. ఇప్పుడు ఇళ్ళల్లో గదుల్లో నే కాదు ఎక్కడ చూసినా కాలికి మట్టి అంతరాదంటూ ఫ్లోరింగ్ ని పాలరాయి, మార్బుల్స్ , రకరకాల టైల్స్ ని అమర్చుకుంటున్నారు. ఇవి మరకలు లేకుండా తళతళలా మెరవాలంటే రోజూ శుభ్రం చేసుకోవాల్సిందే. అందుకనే ఇంటిని మాప్ వేసుకోవడానికి సులభమైన పద్దతులను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది ఇంట్లో కనిపించేది స్పిన్ మాప్. అయితే దీనిని కొన్ని రోజులు ఉపయోగించిన తర్వాత మురికిగా మారుతుంది. అప్పుడు దీనిని శుభ్రం చేయడం అంటే ఒక పెద్ద యుద్ధమే అనిభావిస్తారు. అటువంటి వారు ఈ సింపుల్ టిప్ తో మురికిగా ఉన్న మాప్‌ని తళతళలాడేలా మెరిపించండి.

ఇప్పుడు ఎవరి ఇంట్లో చూసినా స్పిన్ మాప్ ఉంటుంది. వీటిని చాలా మంది తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి మాప్‌లను ఉపయోగిస్తున్నారు. రోజూ దీనితో నేలని శుభ్రం చేయడం వలన మురికి పేరుకుపోతుంది. ఈ మురికి వికారంగా కనిపించడమే కాదు.. నేలను శుభ్రం చేయడంలో మాప్ తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఒక వింత వాసన వస్తుంది. ఇలా మురికిగా మారిన మాప్ లను శుభ్రం చేసే ఓపిక లేని వారు వెంటనే పారేస్తారు. అయితే స్పిన్ మాప్ ని ఉతకకుండా, వాషింగ్ మెషీన్‌లో స్క్రబ్ చేయకుండా శుభ్రం చేసుకోవడానికి సులభమైన చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

మాప్ శుభ్రం చేయడానికి ఈ మిశ్రమాన్ని తయారు చేయండి కావాల్సిన వస్తువులు
బలమైన పాలిథిన్ బ్యాగ్ -1

ఉప్పు – ఒక గిన్నె

బేకింగ్ సోడా- 2 టీస్పూన్ల

బాత్రూమ్ క్లీనర్- కొంచెం

నీరు

డెటాల్

తుడుపుకర్రను ఎలా శుభ్రం చేయాలంటే
మురికిగా ఉన్న మాప్ ని శుభ్రం చేయడానికి.. ముందుగా ఒక దృఢమైన పాలిథిన్ బ్యాగ్ తీసుకోండి. అందులో ఉప్పు , బేకింగ్ సోడా వేసి కలపండి. తరువాత కొద్దిగా బాత్రూమ్ క్లీనర్ , డెటాల్ జోడించండి. తరువాత అవసరమైనంత నీరు జోడించండి. ఈ మిశ్రమం ఉన్న పాలిథిన్ బ్యాగ్ లో మురికిగా ఉన్న మాప్ ని ఉంచండి. హ్యాండిల్ చుట్టూ గట్టిగా కట్టండి. తర్వాత కాసేపు అలాగే ఉంచండి. తరువాత.. పాలిథిన్ బ్యాగ్ తో నేలపై తట్టండి. ఇలా చేయడం వల్ల మురికి తొలగిపోతుంది. తరువాత మాప్ ని నీరుతో శుభ్రం చేయండి.

మాప్ శుభ్రం చేయడానికి మరొక చిట్కా
మాప్ శుభ్రం చేయడానికి.. ఇంట్లోనే కొన్ని పదార్థాలను ఉపయోగించి ఒక ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు.

వెనిగర్‌- ఒక కప్పు

గోరువెచ్చని నీరు

బ్లీచింగ్ – కొంచెం

ముందుగా ఒక కప్పు తెల్ల వెనిగర్‌ను గోరువెచ్చని నీటితో కలపండి. తరువాత కొంచెం బ్లీచ్ జోడించండి. ఈ మిశ్రమంలో మాప్‌ను 15 నిమిషాలు ఉంచండి. తరువాత మాప్ ని బయటకు తీసి శుభ్రమైన నీటితో వాష్ చేయండి. తర్వాత ఈ మాప్ ని మంచి ఎండలో ఆరబెట్టండి. అంతే ఇప్పుడు మాప్‌ కొత్తదానిలా మెరుస్తూ కనిపిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top