AADHAAR TESTING AND CERTIFICATION EXAM – APPLY NOW

ఆధార్​ సెంటర్​ నడపాలనుకుంటున్నారా? – అయితే ఈ పరీక్ష పాసవ్వాల్సిందే.

యూఐడీఏఐ నిర్వహించే పరీక్షలో 65 శాతం మార్కులు వస్తేనే అవకాశంపదేళ్లుగా కేంద్రాలను నిర్వహిస్తున్న వారూ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సిందేతెలంగాణలోని ఆధార్‌ శాశ్వత కేంద్రాలన్నీ ఇన్‌హౌస్‌ మోడల్‌ విధానంలోకి

Aadhaar Testing and Certification Exam : ఆధార్‌ శాశ్వత కేంద్రాలను నడపాలంటే ఇకపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) నిర్వహించే పరీక్షలో 65% మార్కులు తెచ్చుకోవాలి. పదేళ్లుగా కేంద్రాలను నిర్వహిస్తున్న వారు సైతం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. తెలంగాణలోని ఆధార్‌ శాశ్వత కేంద్రాలన్నీ ఏక రీతి (ఇన్‌-హౌస్‌ మోడల్‌) విధానంలోకి మారడమే ఇందుకు కారణం. ఈ విధానాన్ని యూఐడీఏఐ మూడేళ్ల క్రితం నుంచే అమలు చేస్తోంది. మన రాష్ట్రంలోని కొందరు ఆధార్‌ కేంద్రాల నిర్వాహకులు వేతనాలకు బదులు కమీషన్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విధానం అమలులోకి రాలేదు. హైకోర్టు ఇటీవల యూఐడీఏఐ ప్రతినిధులు, నిర్వాహకుల మధ్య సయోధ్య కుదిర్చింది.

ఇన్‌-హౌస్మోడల్కేంద్రాలు :

  • ఇన్‌-హౌస్‌ మోడల్‌ కేంద్రాల పరికరాలకు డిపాజిట్లు చెల్లించాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. వారికి ల్యాప్‌టాప్​తో పాటు రూ.1.50 లక్షల విలువైన సామగ్రిని అందించనుంది.
  • అవకతవకలకు పాల్పడిన నిర్వాహకులను తొలగించి కేంద్రాన్ని కొత్తవారికి అప్పగిస్తారు. బాధ్యులపై కఠిన చర్యలుంటాయి.
  • రాష్ట్రంలో మొత్తం 1,151 ఆధార్‌ శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చెశారు. వాటిలో వివిధ కారణాలతో 424 మూతపడ్డాయి. ప్రస్తుతం 727 కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. కొత్త విధానంతో అన్ని కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి.

నూతన కార్డులు, వేలిముద్రలుఇకపై ఇన్‌-హౌస్‌ కేంద్రాల్లో నూతన కార్డుల జారీ, వేలిముద్రల నవీకరణ మాత్రమే చేస్తారు. మీ-సేవ వంటి ఆన్‌లైన్‌ కేంద్రాల్లోనూ పేర్లు, చిరునామాలను అప్డేట్ చేసే సేవల్ని అందుబాటులోకి తేనున్నారు. పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా, సెల్‌నంబరు వంటి వాటిని కార్డుదారులే నేరుగా ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు.

ఆధార్కార్డును అప్డేట్కాగా ఆధార్​ కార్డుల అప్డేట్​కు కేంద్రప్రభుత్వం ఏడాది వరకు గడువు తేదీని పొడిగించింది. దీంతో వచ్చే సంవత్సరం జూన్‌ 30వ తేదీ వరకు ఆధార్‌ కార్డును అప్డేట్​ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తే కార్డును సస్పెండ్‌ చేస్తారు. ఒక్కసారి ఆధార్‌కార్డు సస్పెండ్ అయితే దానిని పునరుద్ధరించుకోవడానికి వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు అందించి మళ్లీ కొత్త ఆధార్​కార్డు కోసం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. కార్డులను అప్డేట్​ చేయడానికి కొందరు ఉత్సాహం చూపుతున్నారు. మరికొందరు అవగాహన లేక అందుకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు ఫోన్​లో మై ఆధార్‌ యాప్‌ ద్వారా వివరాలను అప్​డేట్ చేసుకుంటున్నారు.

ప్రతి పదేళ్లకు ఒకసారి : 10 సంవత్సరాల క్రితం కార్డులను పొందిన వారు ఆధార్‌కార్డులను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఐ నుంచి కార్డుదారులకు సెల్​ఫోన్​లో సంక్షిప్త సందేశాలు అందుతున్నాయి. అప్పుడు ఊరూరా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆధార్‌ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్డుుల పది సంవత్సరాల వరకు మాత్రమే చెల్లుబాటయ్యే విధంగా నిబంధనలు తీసుకు వచ్చారు. ప్రతీ పదేళ్లకు ఒకసారి ఆధార్‌ కార్డును నవీకరించుకోవాలని సూచించారు.

ఎంతో కీలకం : ప్రస్తుతం అన్నింటికీ ఆధార్‌కార్డు కీలకంగా మారింది. బ్యాంకు అకౌంట్లు తెరవడం, విద్యార్థుల అడ్మిషన్లు, పింఛన్లు, ఉద్యోగ నియామకాలు, రేషన్‌ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్​ ఫండ్, రైతు భరోసా, రైతు బీమా లాంటి ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేశారు. ఆధార్‌ అప్‌డేట్‌ చేయకపోతే కొందరికి పింఛన్లు, రేషన్ కూడా ఆగిపోయే ప్రమాదముంది. కొందరు ఆధార్‌ ఐడీలు తీసుకున్నప్పటికీ అప్‌డేట్‌ చేసుకోలేకపోతున్నారు.

1 thought on “AADHAAR TESTING AND CERTIFICATION EXAM – APPLY NOW”

  1. Annu Kiran Kumar

    Iam Earlier Worked As Supervisor In Aadhaar Process Under Smartchip Ltd Co. In Various Locations. I Have Passed Certificate Course In Both Operator & Supervisor. I want To Run Aadhaar Center Pls..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top