AIIMS CRE Notification 2025 | Apply Now

ఎయిమ్స్ లో భారీగా ఉద్యోగాల భర్తీ

AIIMS CRE Notification 2025 ఆల్ ఇండియా ఇన్ స్టిటయూట్ ఆఫ్ మెడికల్  సైన్సెస్(AIIMS) నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. వివిధ AIIMS సంస్థల్లో సుమారు 3,000 వరకు గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయడం కోసం సెంట్రల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్(CRE) 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 19 ప్రీమియర్ ఎయిమ్స్ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు జులై 12వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

AIIMS CRE Notification 2025 Overview :

నియామక సంస్థ ఆన్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ మెడికల్ సైన్సెస్ (AIIMS)
ఎగ్జామినేషన్ పేరు సెంట్రల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (CRE)
పోస్టు పేరు వివిధ గ్రూప్ బి మరియు గ్రూప్ సి నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
పోస్టుల సంఖ్య దాదాపు 3,000
భర్తీ చేస్తున్నా స్థానాలు దేశంలోని 19 నగరాల్లో
జాబ్ టైప్ పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
దరఖాస్తు విధానం ఆన్ లైన్
దరఖాస్తులకు చివరి తేదీ 31 జులై,  2025

పోస్టుల వివరాలు :

ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కామన్  రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (CRE) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 3,000 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 53 వేర్వేరు పోస్టులతో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఖాళీల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరు ఖాళీలు పోస్టు పేరు ఖాళీలు
అసిస్టెంట్ డైటీషిన్ 09 డైటీషియన్ 13
అసిస్టెంట అడ్మినిస్ట్రేటివ్ ఆపీసర్ 02 జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 24
జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ / LDC 46 UDC / సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 702
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 5 జూనియర్ ఇంజనీర్ (సివిల్) 7
అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 03 జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) 08
అసిస్టెంట్ ఇంజనీర్ (A/C&R) 1 జూనియర్ ఇంజనీర్ (A/C&R) 8
ఆడియాలజిస్ట్ 3 ఆడియోమీటర్ టెక్నీషియన్ 15
టెక్నికల్ అసిస్టెంట్(ENT) 5 ఎలక్ట్రీషియన్ 6
లైన్ మ్యాన్(ఎలక్ట్రికల్) 1 వైర్ మ్యాన్ 11
గ్యాస్ / పంప్ మెకానిక్ 1 మానిఫోల్డ్ రూమ్ అటెండెంట్ 1
మానిఫోల్డ్ టెక్నీషియన్ 8 అసిస్టెంట్ లాండ్రీ సూపర్ వైజర్ 9
ఓటీ అసిస్టెంట్ 120 ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 78
ఫార్మసిస్ట్ గ్రేడ్-2 38 డిస్పెన్సింగ్ అటెండెంట్లు 1
ఫార్మా కెమిస్ట్ 1 ఫార్మసిస్ట్(అలోపతి) 273
క్యాషియర్ 21 చీఫ్ క్యాషియర్ 1
అకౌంటెంట్ 8 లిఫ్ట్ ఆపరేటర్ 9
CSSD టెక్నీషియన్ 1 డిసెక్షన్ హాల్ అటెండెంట్ 9
హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్-3 47 మార్చురీ అటెండెంట్ 7
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 48 ఆఫీస్ అటెండెంట్ 21
స్లోర్ అటెండెంట్ గ్రేడ్-2 3 ల్యాబ్ అటెండెంట్ 57
ల్యాబ్ టెక్నీషియన్ 9 జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ 371
లాబొరేటరీ అసిస్టెంట్ 5 మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ 43
సీనియర్ టెక్నీషియన్ 8 టెక్నికల్ అసిస్టెంట్(MLT)1 16
టెక్నీషియన్(లాబొరేటరీ) 5 టెలిఫోన్ ఆపరేటర్ 2
డెంటల్ చైర్ సైడ్ అసిస్టెంట్ 1 డెంటల్ మెకానిక్ 28
డెంటల్ టెక్నీషియన్ 5 రెఫ్రాక్షనిస్ట్ 3
రేడియోథెరపి  టెక్నీషియన్ 4 రేడియోథెరపిస్ట్ 19
డార్క్ రూమ్ అసిస్టెంట్ 5 జూనియర్  రేడియోగ్రాఫర్ 79
రేడియోగ్రాఫర్ 12 రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ 14
టెక్నిషియన్ (రేడియాలజీ) 31 పెర్ఫ్యూషనిస్ట్ 9
ఫార్మసిస్ట్(హోమియోపతి) 3 ఎంబ్రాయలజిస్ట్ 1
లైఫ్ గార్డ్ 1 ఫిజియోథెరపిస్ట్ 2
వొకేషన్ కౌన్సిలర్ 2 లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 4
డ్రైవర్ 13 హెల్త్ ఎడ్యుకేటర్ 2
మెడికో సోషల్ వర్కర్ 32 సోషల్ వర్కర్ 3
ఆర్టిస్ట్ 17 జూనియర వార్డన్ 24
ప్రిన్సిపల్ పీఏ 8 స్టెనోగ్రాఫర్ 221
ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్ 1 డెమాన్ స్ట్రేటర్ 1
సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ 92 వర్క్ షాప్ టెక్నీషియన్ 9
కోడింగ్ క్లర్క్ 2 మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ 75
మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ 144 బయోమెడికల్ ఇంజనీర్ 3
కంప్యూటర్ డేటా ప్రాసెసర్ 5 జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ 4
సైంటిఫిక్ ఆఫీసర్ కమ్ ట్యూటర్ 4 టైలర్ గ్రేడ్-3 1
మెకానిక్ (ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజరేషన్) 1 న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ 9
ఆప్టోమెట్రిస్ట్ 48 ప్లంబర్ 4
PACS అడ్మినిస్ట్రేటర్ 1 సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ 238
ఈసీజీ టెక్నీషియన్ 67 రెస్పిరేటరీ లాబొరేటరీ అసిస్టెంట్ 34
ఫార్మసిస్ట్ (ఆయుర్వేదిక్) 5 అసిస్టెంట్ బయోకెమిస్ట్ 1
జూనియర్ ఫిజిసిస్ట్ 1

అర్హతలు :

AIIMS CRE Notification 2025 పోస్టు వారీగా విద్యార్హతలు మారుతాయి. అభ్యర్థులు పోస్ట్ నిర్దిష్ట అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడొచ్చు. లింక్ కింద ఇవ్వబడింది.

వయోపరిమితి :

AIIMS CRE Notification 2025 వయోపరిమితి పోస్టును బట్టి 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు :

AIIMS CRE Notification 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

కేటగిరి అప్లికేషన్ ఫీజు
జనరల్ / ఓబీసీ రూ.3,000/-
ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ రూ.2,400/-
దివ్యాంగులకు ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ:

AIIMS CRE Notification 2025 పోస్టులకు అభ్యర్థులు ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • నైపుణ్య పరీక్ష (వర్తిస్తే)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు :

AIIMS CRE Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు AIIMS CRE నిబంధనల ప్రకారం జీతాలు చెల్లిస్తారు. 7వ సీపీసీ ఆధారంగా పోస్టును బట్టి లెవల్-1 నుంచి లెవల్-8 వరకు జీతాలు ఉంటాయి. అభ్యర్థులకు అన్ని రకాల అవలెన్సులు అందుతాయి.

దరఖాస్తు విధానం :

AIIMS CRE Notification 2025  పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
  • కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్-2025 పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • లాగిన్ అయ్యా దరఖాస్తు ఫారమ్ నింపాలి.
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 12 జులై, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 31 జులై, 2025
  • CBT తేదీ : ఆగస్టు 25 & 26వ తేదీల్లో
Notification Click here
Apply Online Click here

3 thoughts on “AIIMS CRE Notification 2025 | Apply Now”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top