AP Thalliki Vandanam Scheme 2025:
ఏపీ తల్లికి వందనం పథకం 2వ రెండవ విడత Final అఫీషియల్ జాబితా వచ్చేసింది: మీ పేరుతో ‘Eligible’ అని ఉందా లేదా ఇప్పుడే చెక్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైనటువంటి తల్లికి వందనం 2025 పథకానికి సంబంధించి రెండవ విడత అర్హుల ఫైనల్ జాబితా లిస్టు ని అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఈ రెండవ విడత జాబితాలో ‘Eligible and to be Paid’ అని ఉన్న లబ్ధిదారులకు కచ్చితంగా జూలై 10వ తేదీన డబ్బులు డిపాజిట్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు జూలై 10వ తేదీన పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ సందర్భంగా రెండో విడత జాబితాలో అర్హులైనటువంటి వారికి ₹13,000/- తల్లికి వందనం పథకం కింద డబ్బులు డిపాజిట్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రెండవ విడత జాబితాలో మీ పేరు ఉందా లేదా అనే వివరాలు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి పూర్తి సమాచారం చూడండి.
రెండవ విడత జాబితా ముఖ్యమైన తేదీలు:
- జూలై 5, 2025 : రెండవ విడత అర్హుల పూర్తి జాబితా సిద్ధం చేయాలి
- జూలై 10, 2025: రెండవ విడత జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు జూలై 10వ తేదీ పేరెంట్ టీచర్ మీటింగ్ (PTM) లో నేరుగా డిపాజిట్ చేయనున్నారు.
రెండవ విడతలో ఎవరికీ డబ్బులు డిపాజిట్ అవుతాయి?:
రెండో విడతలో తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో ఈ క్రింది వారికి డబ్బులు డిపాజిట్ అవుతాయి.
- మొదటి విడతలో అర్హతలు ఉన్న డబ్బులు డిపాజిట్ కాని వారికి, వారు అభ్యంతరాలు పెట్టుకున్నట్లయితే, వారికి డబ్బులు డిపాజిట్ అవుతాయి.
- ఒకటవ తరగతిలో జాయిన్ అయ్యే5 లక్షల విద్యార్థుల తల్లులకు డిపాజిట్ అవుతాయి
- అలాగే, ఇంటర్మీడియట్ ఫస్టియర్ లో జాయిన్ అయ్యే7లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు డిపాజిట్ అవుతాయి.
2వ విడత ఫైనల్ లిస్ట్ లో Status కేటగిరీస్ ఉన్న వివరాలకు అర్థం ఏమిటి?:
- Eligible and Paid: మీకు డబ్బులు జమ అయ్యాయి అని అర్థం
- Eligible and to be paid: అర్హత ఉంది, త్వరలో డబ్బులు డిపాజిట్ అవుతాయి
- Not in thalliki Vandanam data:అర్హత ఉన్నా కూడా మీ వివరాలు డేటాలో లేవు
- child is eligible but details not found in eligible /Ineligible List: ఇలా ఉంటే, ఇది ముఖ్యమైన సమస్య. దీనికి మీరు గ్రీవెన్స్ ఫారం సబ్మిట్ చేయాలి.
- mother/ child/ Guardian /death:ఈ క్యాటగిరీలో ఉన్న లబ్ధిదారులకు ప్రత్యేక పరిశీలన ఉంటుంది.
మీరు రెండో విడత జాబితా ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి?:
తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితా ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ క్రింది విధంగా చేయండి.
- రెండవ విడత జాబితా చూసుకోవడానికి, మీరు నేరుగా మీ దగ్గరలోని గ్రామా లేదా వార్డు సచివాలయానికి వెళ్లి, అక్కడ డిజిటల్ అసిస్టెంట్ ని సంప్రదించండి. వారు మీకు తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితా లిస్టులో మీ పేరు “Eligible & To be Paid” అని ఉందా లేదా చెక్ చేసి చెప్తారు.
- లేదా మీ మొబైల్ లోనే, ఆంధ్రప్రదేశ్ మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా, తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసుకొని, మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీరు అర్హులా కాదా అనేది చెక్ చేసుకోవచ్చు.
₹13,000/- ఎప్పుడు డిపాజిట్ అవుతాయి?:
తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు జూలై 10వ తేదీ ( పేరెంట్ టీచర్ మీటింగ్ ) రోజున డబ్బులు డిపాజిట్ చేయడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. కావున అర్హులైన తల్లులకు వారికి ఎంత మంది పిల్లలు ఉంటే వారు స్కూల్ లేదా కాలేజీకి వెళుతున్నట్లయితే కచ్చితంగా అదే రోజు నేరుగా మీ యొక్క ఖాతాలో ₹13,000/- డిపాజిట్ అవుతాయి.
పైన చెప్పిన విధంగా మీరు రెండో విడత జాబితాలో ఉన్నారా లేదో చెక్ చేసుకున్న తర్వాత, మీ స్టేటస్ వివరాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు.
VenkataramanaDvenkataramana2@gmail. Com
Tallikivandanam
తల్లికి వందనం డబ్బులు