Are you eating green chilies? What happens in your body?

Are you eating green chilies? – Do you know what happens in your body?

పచ్చి మిర్చి ఘాటుగానే కాదు, ఆరోగ్యానికీ మంచిదట! – నిపుణులు ఏమంటున్నారంటే!

పచ్చి మిరపకాయలు తింటున్నారా? – బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Health Benefits of Green Chillies : పచ్చి మిరపకాయలు కేవలం రుచికి కారంగా మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి ఎ, సి విటమిన్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా, కంటి చూపును మెరుగుపరుస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పచ్చి మిరపకాయలను ఆహారంలో తగిన మోతాదులో చేర్చుకోవడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను సులభంగా పొందవచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

యాంటీఆక్సిడెంట్ల : పచ్చి మిరపకాయల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమ్మేళనాలు వృద్ధాప్య ఛాయలను తగ్గించి, అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని పేర్కొన్నారు. పచ్చి మిరపకాయలలో ఎ, బి2, బి3, బి6, బి9, సి, ఇ విటమిన్లు ఉంటాయని, విటమిన్ సి అనేది బలమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ను నుంచి రక్షణ కల్పిస్తుందని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది.

క్యాన్సర్ నివారిణిగాఇందులో శక్తివంతమైన సహజ రసాయనాలు ఉంటాయని, ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా శరీరంలోని హానికరమైన కణాల పెరుగుదలను క్యాప్సైసిన్ ఆపుతుందని, కొన్ని రకాల కణాలను నాశనం చేస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. రొమ్ము, కడుపు, పెద్దప్రేగు క్యాన్సర్ కణాలపై ఈ ప్రభావం కనిపించిందని పేర్కొన్నారు.

బరువు అదుపులోపచ్చి మిరపకాయలు జీవక్రియను వేగవంతం చేసి, ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చేస్తాయని, ఇందులో ఉండే క్యాప్సైసిన్ అనే సమ్మేళనం కొవ్వును కరిగించడంతో పాటు కొవ్వు నిల్వలు ఏర్పడకుండా నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు కలిగించడం వల్ల అతిగా తినకుండా ఉంటామని, తద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి తోడ్పడుతుందని వివరించారు.

గుండె ఆరోగ్యానికి : పచ్చి మిరపకాయలు రక్త ప్రసరణను మెరుగుపరచడం, రక్తం గడ్డకట్టడాన్ని నివారించడం, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి రక్తనాళాలలోని ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయని, తద్వారా గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుందని పేర్కొన్నారు.

షుగర్ అదుపులో : కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదించడంతో పాటు ఇన్సులిన్ ఉపయోగాన్ని మెరుగుపరుస్తుందంటున్నారు. దీనివల్ల శరీరం శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటుందని, తద్వారా రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉంటుందని పేర్కొన్నారు. మిరపకాయల ద్వారా బరువు తగ్గడం అనేది ఇన్సులిన్ మెరుగైన నియంత్రణ ఫలితంగా కూడా ఉంటుంది. ఇది బరువు నిర్వహణకు మద్దతతో పాటు ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ రుగ్మతలు వంటి వ్యాధుల చికిత్సకు సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుందని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది.

నొప్పిని తగ్గిస్తుందిపచ్చి మిరపకాయల్లో సహజ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని, ఇవి కొన్ని సూక్ష్మజీవుల నుంచి రక్షణ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి సహజ నొప్పినివారిణిలా పనిచేస్తాయని, ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఉపశమనం కలిగించవచ్చని పేర్కొన్నారు.

పచ్చి మిరపకాయలను మితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కానీ, అధికంగా తీసుకుంటే అలర్జీలు లేదా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top