BEL Project & Trainee Engineer Recruitment 2025 | Apply

BEL Project & Trainee Engineer Recruitment 2025 | BEL ప్రాజెక్ట్ మరియు ట్రైనీ ఇంజనీర్ పోస్టులు

BEL Project & Trainee Engineer Recruitment 2025 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL), హైదరాబాద్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ ఇంజనీర్-1 మరియు ట్రైనీ ఇంజనీర్-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

BEL Project & Trainee Engineer Recruitment 2025 Overview

నియామక సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
పోస్టు పేరు ప్రాజెక్ట్ ఇంజనీర్-1 మరియు ట్రైనీ ఇంజనీర్-1
పోస్టుల సంఖ్య 80
దరఖాస్తు ప్రక్రియ 28 ఆగస్టు – 12 సెప్టెంబర్, 2025
జాబ్ లొకేషన్ హైదరాబాద్

ఖాళీల వివరాలు :

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న ప్రభుత్వ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) నుంచి ట్రైనీ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. BEL యొక్క హైదరాబాద్ యూనిట్ లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టు పేరు ఇంజనీరింగ్ విభాగం ఖాళీలు
ట్రైనీ ఇంజనీర్-1 ఎలక్ట్రానిక్స్ 55
ట్రైనీ ఇంజనీర్-1 మెకానికల్ 11
ట్రైనీ ఇంజనీర్-1 కంప్యూటర్ సైన్స్ 01
ప్రాజెక్ట్ ఇంజనీర్-1 ఎలక్ట్రానిక్స్ 06
ప్రాజెక్ట్ ఇంజనీర్-1 మెకానికల్ 04
ప్రాజెక్ట్ ఇంజనీర్-1 కంప్యూటర్ సైన్స్ 01
ప్రాజెక్ట్ ఇంజనీర్-1 ఎలక్ట్రికల్ 01
ప్రాజెక్ట్ ఇంజనీర్-1 సివిల్ 01

అర్హతలు :

BEL Project & Trainee Engineer Recruitment 2025 పోస్టులను బట్టి సంబంధిత విభాగాల్లో BE / B.Tech / BSc Engineering ఉత్తీర్ణులై ఉండాలి.

  • ట్రైనీ ఇంజనీర్-1 : సంబంధిత విభాగాల్లో BE / B.Tech / BSc Engineering
  • ప్రాజెక్ట్ ఇంజనీర్-1 : సంబంధిత విభాగాల్లో BE / B.Tech / BSc Engineering + 2 సంవత్సరాల సంబంధిత పోస్ట్ క్వాలిఫికేషన్ ఇండస్ట్రియల్ అనుభవం ఉండాలి.

వయోపరిమితి :

  • ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు : 28 సంవత్సరాలు
  • ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు : 32 సంవత్సరాలు
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5  సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు :

BEL Project & Trainee Engineer Recruitment 2025 అభ్యర్థులు ఎస్టీఐ కలెక్ట్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

పోస్టు ఫీజు
ట్రైనీ ఇంజనీర్ రూ.177/-
ప్రాజెక్ట్ ఇంజనీర్ రూ.472/-
SC / ST / PwBD ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ :

BEL Project & Trainee Engineer Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.

ట్రైనీ ఇంజనీర్ :

  • రాత పరీక్ష – 100 మార్కులకు(నెగిటివ్ మార్కింగ్ ఉంది)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

ప్రాజెక్ట్ ఇంజనీర్ :

  • రాత పరీక్ష – 85 మార్కులు(నెగిటివ్ మార్కింగ్ లేదు)
  • పర్సనల్ ఇంటర్వ్యూ – 15 మార్కులు
  • ఫైనల్ మెరిట్ లిస్ట్

జీతం వివరాలు :

BEL Project & Trainee Engineer Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.

ట్రైనీ ఇంజనీర్ :

  • 1వ సంవత్సరం : రూ.30,000/-
  • 2వ సంవత్సరం : రూ.35,000/-
  • 3వ సంవత్సరం : రూ.40,000/-

ప్రాజెక్ట్ ఇంజనీర్ :

  • 1వ సంవత్సరం : రూ.40,000/-
  • 2వ సంవత్సరం : రూ.45,000/-
  • 3వ సంవత్సరం : రూ.50,000/-
  • 4వ సంవత్సరం : రూ.55,000/-

దరఖాస్తు విధానం :

BEL Project & Trainee Engineer Recruitment 2025 అభ్యర్థులు కింది దశల్లో దరఖాస్తు చేసుకోవాలి.

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో గూగుల్ ఫారమ్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి, అందులో వివరాలు జాగ్రత్తగా నింపాలి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • దీని కాపీ మెయిల్ కి వస్తుంది. దానిని ప్రింట్ తీసుకోవాలి.
  • గూగుల్ ఫారమ్ పై పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలి.
  • తర్వాత అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
  • అప్లికేషన్ తో అవసరమైన పత్రాలు జత చేయాలి.
  • గూగుల్ ఫారమ్, అప్లికేషన్ ఫారమ్ మరియు అవసరమైన పత్రాలతో వాక్ ఇన్ ఎంపికకు హాజరుకావాలి.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 28 ఆగస్టు, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 12 సెప్టెంబర్, 2025
  • రాత పరీక్ష తేదీ : 14 సెప్టెంబర్, 2025
  • ఇంటర్వ్యూ : 15 సెప్టెంబర్, 2025
Notification Click here
Apply Link Click here
Google Form Click here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top