Collector’s Gift to motorists who wear helmets | Check Now

Collector’s compliments to motorists who wear helmets.

హెల్మెట్‌ వాడే వాహనదారులకు కలెక్టర్‌ సైర్‌ఫ్రైజ్‌.. రోడ్డుపై వాహనాలు ఆపిమరీ..

రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. పట్టణకేంద్రంలో హెల్మెట్ ధరించి వాహనాలు నడిపే వాహనదారులను ఆపి వాళ్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్స్‌ ఇచ్చారు. రోడ్డు భద్రత పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.

మన భద్రత కోసం రోడ్డుపై ప్రయాణం చేసేటపుడు హెల్మెట్ ధరించాలని పదే పదే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు చెబుతూ, అవగాహన కల్పిస్తూ ఉంటారు. వినని వారికి ఫైన్ లు వేస్తారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ప్రమాదాలు జరుగుతూ మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం , తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురువుతున్నారు వాహనదారులు. అయితే ఈ ప్రమాదాలపై దృష్టి పెట్టిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రాఫిక్ పోలీసులు, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు హెల్మెట్స్‌ పెట్టుకొని రూల్స్‌ పాటించే వారికి రోడ్డు సేఫ్టీ సర్ప్రైజ్ గిఫ్ట్ పేరుతో బహుమతులు అందజేశారు.

రోడ్డు సేఫ్టీ సర్ప్రైజ్ గిఫ్ట్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తున్న వాహనదారులను ఆపి వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందచేసారు. పట్టణంలో హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహన దారులను ఆపి కలెక్టర్ జితేష్ వి పాటిల్ సర్ప్రైజ్ గిఫ్ట్ లు అందించారు. రోడ్డు భద్రత పై ప్రజల్లో అవగాహన కోసం చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుండి సానుకూల స్పందన లభించింది. హెల్మెట్ ప్రాధాన్యతపై రవాణా అధికారులు ప్రజల్లో చైతన్యానికి వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హెల్మెట్ లేని వారికి ఫైన్ లు విధించే సిబ్బంది, హెల్మెట్ ధరించే వారికి ప్రోత్సాహకాలు అందించటంతో చైతన్యం కల్పించింది. హెల్మెట్‌ ప్రాధాన్యను తెలియజేసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు హెల్మెట్‌ పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. హెల్మెట్‌ మనకు ప్రమాద సమయంలో ఒక రక్షణ కవచంగా నరిచేస్తుందని తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top