Do you keep milk in the fridge to keep it fresh?

Do you keep milk in the fridge to keep it fresh? Don’t make these mistakes.

Milk Storage: పాలు తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ పొరపాట్లు చేయకండి..

మనం రోజు ఉపయోగించే పాలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ, పాల ప్యాకెట్ ఇంటికి రాగానే వాటిని ఫ్రిజ్‌లో ఎక్కడో ఒకచోట పెట్టేస్తుంటాం. చిన్న పొరపాటు వల్ల అవి త్వరగా పాడైపోతాయి. మనం రోజూ తాజా పాలు అనుకునేవి, వాస్తవానికి ఒకరోజు ముందు సేకరించినవి కావచ్చు. అందుకే పాలను సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే అవి త్వరగా పాడైపోతాయి. దీనికి ఫ్రిజ్‌లో పాలను పెట్టేటప్పుడు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మనం రోజూ వాడే పాలు, నిజానికి ఒకరోజు ముందు సేకరించినవి. ఉదాహరణకు, మీరు ఉదయం 8 గంటలకు ఒక పాల ప్యాకెట్ వాడితే, అవి అంతకు ముందు రోజు సాయంత్రం 5 గంటలకు సేకరించినవి కావచ్చు. అంటే అవి తాజా పాలు కావు. అందుకే పాలను సరిగా నిల్వ చేయకపోతే త్వరగా పాడైపోతాయి. చాలామంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.

పాలు నిల్వ చేయడంలో ముఖ్యమైన చిట్కాలు:

పాలను ఫ్రిజ్లో ఎక్కడ పెట్టాలి?: పాలను ప్యాకెట్ రూపంలో లేదా సీసాలో పోసి డోర్ లో పెట్టవద్దు. ఫ్రిజ్ డోర్ ఉష్ణోగ్రత తరచుగా మారుతుంటుంది. ఇది కూలింగ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. పాలను ఫ్రిజ్ లోపలి వైపు, ఫ్రీజర్‌కు దగ్గరగా ఉండే షెల్ఫ్‌లో పెట్టాలి. అక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. పాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

వేడి పాలను పెట్టవద్దు: చాలామంది పాలను కాచి, అవి పూర్తిగా చల్లారకముందే ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇది సరికాదు. వేడి పాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల లోపల కూలింగ్ సిస్టం దెబ్బతింటుంది. అలాగే, దానిలోని తేమ వల్ల లోపలి వాతావరణం ప్రభావితం అవుతుంది.

టెట్రా ప్యాక్ పాల గురించి: చాలామంది టెట్రా ప్యాకెట్లలోని పాలు వాడతారు. ఇవి ఇప్పటికే కాచిన పాలు. వీటిని నేరుగా వాడుకోవచ్చు. అయితే, వీటిలో సాధారణ పాల కంటే కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ప్యాకెట్ తెరిచిన తర్వాత వాటిని ఫ్రిజ్‌లో పెట్టడం తప్పనిసరి.

అవసరానికి తగ్గట్టుగా కొనుక్కోండి: పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కంటే, అవసరానికి తగినంతగా మాత్రమే ఎప్పటికప్పుడు కొనుక్కోవడం మేలు. తద్వారా తాజా పాలను వాడినట్లు అవుతుంది. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి.

పరిశుభ్రత ముఖ్యం: పాలను ఒక గిన్నెలో పోసి, దానిపై గట్టిగా మూత పెట్టండి. పాలు ఎప్పటికప్పుడు తాజాగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. పాడైన పాలను తాగితే కడుపు నొప్పి, వాంతులు లాంటి సమస్యలు వస్తాయి.

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. నిపుణులు మాత్రం పాలను రెగ్యులర్‌గా వాడడం ఆరోగ్యకరం అని సూచిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top