Don’t you know your police station? – Find out here!

 మీ పోలీస్​ స్టేషన్​ మీకు తెలియట్లేదా? – ఇలా తెలుసుకోండి! – CYBERABAD POLICE WEBSITE

నేరాలు, గొడవలు జరిగినప్పుడు ఠాణా ఏదో తెలియక తికమకపడుతున్న జనంసైబరాబాద్పోలీస్అనే వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చిన సీపీ అవినాశ్మహంతి.

Know Your Police Station In Hyderabad : హైదరాబాద్​ నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అనూహ్యంగా అనుకోకుండా ఏదో ఒక నేర ఘటన జరుగుతుంది. వేధింపులు, గొడవ ఘటన ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో స్థానికంగా ఉండే పోలీస్‌స్టేషన్‌ వెళ్దామంటే జ్యురిస్టిక్షన్‌ పరిధి ఏదో తెలియక కన్​ఫ్యూజ్​ అవుతుంటారు. ఒక పోలీస్​ స్టేషన్​కు బదులు ఇంకో పోలీస్​ స్టేషన్​కు వెళ్తే తమ పరిధి కాదని కొందరు పోలీసు సిబ్బంది వారికి చెప్పి అక్కడికి వెళ్లండని పంపిస్తుంటారు. ఈ తరహా సరిహద్దు సమస్యలకు పరిష్కారంగా సైబరాబాద్‌ పోలీసులు సరికొత్తగా ఆలోచించి వెబ్​సైట్​ను అందుబాటులోకి తీసుకు వచ్చాారు.

వారు ఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్నారో ఆన్‌లైన్‌లో తెలుసుకునేలా ఎలా వెళ్లాలో కూడా మార్గనిర్దేశం చేసే అత్యాధునిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి ఐపీఎస్​ ఆదేశాలతో కొన్నిరోజుల క్రితం ఈ సౌకర్యం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. పోలీస్‌స్టేషన్ల మధ్య సరిహద్దుల సమస్య లేకుండా ఇది వేగంగా పనిచేస్తుంది.

వెబ్సైట్లోకి ఎలా వెళ్లాలంటే..

  • మొబైల్​ ఫోన్‌లో సైబరాబాద్‌ పోలీస్‌ (cyberabadpolice.gov.in) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • అనంతరం జ్యురిస్టిక్షన్‌ ఫైండర్‌ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి.
  • పోలీస్‌ జ్యురిస్డిక్షన్‌ ఫైండర్‌ పేరుతో మీకు ప్రేమ్​ ప్రత్యక్షమవుతుంది. అందులోని ఫైండ్‌ మై పోలీస్‌స్టేషన్‌ ఆప్షన్‌ ఓపెన్ చేయాలి.
  • ఇందుకు ఫోన్‌లో లొకేషన్‌ ఆప్షన్ ఆన్‌లో ఉండాలి. ఆన్‌లో లేకపోతే వెబ్‌సైట్‌ పర్మిషన్ కోరుతుంది.
  • గూగుల్‌ మ్యాప్స్‌ ఆధారంగా మీరున్న పోలీస్‌స్టేషన్‌ పరిధి ఏంటో స్టేషన్‌ ఎంత దూరంలో ఉందో కచ్చితమైన సమాచారం మీ స్క్రీన్​ మీద చూపిస్తుంది.
  • డైరెక్షన్స్‌ మీద క్లిక్‌ చేస్తే సదరు పోలీస్​ స్టేషన్​కు ఎలా వెళ్లాలో ఏయే రూట్​లు అందుబాటులో ఉన్నాయో కూడా చూపిస్తుంది.

ఆన్లైన్లో ఫిర్యాదులు : కొత్త పోలీస్​ చట్టాల్లో భాగంగా జీరో ఎఫ్‌ఐఆర్​ జులై 1నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఆన్‌లైన్‌లోనే పోలీసులకు కంప్లైంట్​ చేయవచ్చు. ఈ కొత్త చట్టాల ప్రకారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లనవసరం లేకుండానే ప్రజలకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే వీలు కలుగనుంది. తద్వారా తేలికగా, వేగంగా సమస్యను తెలియజేయడంతోపాటు పోలీసుల రెస్పాన్స్​ను సులభతరం చేస్తుంది.

  • ఏదైనా ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఏ పోలీస్‌ స్టేషన్‌కైనా ఆన్‌లైన్‌లో తెలియజేసే అవకాశం ఉంది.
  • జీరో ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీసుస్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్‌ స్టేషన్లోనైనా కంప్లైంట్ చేయవచ్చు.
  • బాధితులతోపాటు నిందితులు కూడా ఎఫ్‌ఐఆర్‌ కాపీలను ఉచితంగా పొందే సౌకర్యం ఉంది. వీటితోపాటు పోలీస్‌ రిపోర్టు, ఛార్జిషీట్‌, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను 14 రోజుల్లోగా పోలీస్​ స్టేషన్​ నుంచి పొందవచ్చు.
  • అరెస్టు సందర్భాల్లో బాధితుడు తమ సన్నిహితులు, బంధువులకు ఆ పరిస్థితిని తెలియజేసే హక్కు కూడా ఉంటుంది. తద్వారా తక్షణ సహాయం పొందేందుకు అవకాశం కలుగుతుంది.
  • అరెస్టుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌తోపాటు జిల్లా పోలీస్​ హెడ్‌ క్వార్టర్లలోనూ బహిరంగంగా తెలియజేసేలా ప్రదర్శిస్తారు. తద్వారా అరెస్టు సమాచారాన్ని బాధితుల కుటుంబీకులు, స్నేహితులు సులభంగా తెలుసుకునే వీలుంటుంది.
  • కేసు, దర్యాప్తును పటిష్ఠంగా నిర్వహించేందుకు గాను తీవ్రమైన నేరాల్లో ఫోరెన్సిక్‌ నిపుణులు, పోలీసులతో తప్పనిసరిగా ఘటనా స్థలాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. దీంతోపాటు సాక్ష్యాలను తారుమారు చేయడాన్ని నిరోధించేందుకు నేరం జరిగిన ప్రాంతంలో ఆధారాలను సేకరించే క్రమాన్ని తప్పనిసరిగా వీడియోగ్రఫీ చిత్రీకరించి భద్రపరచాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top