How To Apply For New Voter Card Online

స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేస్తున్నాయ్! – ఇంట్లో నుంచే ఓటర్ ​కార్డుకు దరఖాస్తు చేయండిలా! – HOW TO APPLY FOR NEW VOTER CARD

ఓటర్కార్డు దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసిన ఎన్నికల సంఘంఆన్లైన్ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం

How To Apply For New Voter Card Online : మీకు 18 ఏళ్లు నిండాయా? ఓటర్​ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. ఇప్పుడు అతిసులభంగా ఓటర్​కార్డును పొందవచ్చు. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఏఏ వివరాలు నమోదు చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఓటరు గుర్తింపు కార్డు జారీ ఇక మరింత సులభతరం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం నూతన గైడ్​లైన్స్​ ప్రకారం కార్డు రావడం ఇక ఆలస్యం కాదు. ఎలక్ట్రో ఫొటో ఐడెంటిటీ కార్డు (ఈపీఐసీ) పేరుతో నూతన వెబ్‌సైట్‌లో కొత్త కార్డు, మార్పులుచేర్పులకు అవకాశం కూడా ఉంది. 15 రోజుల్లో ఎలక్ట్రో ఫొటో ఐడెంటిటీ కార్డు అందనుంది. పోలింగ్‌ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా సంఘం సంస్కరణలు చేపడుతోంది. వెబ్‌సైట్‌లో యువతను ఆకర్షించే విధంగా మార్పులు చేసింది.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ఎలా : ముందుగా ఎన్​వీఎస్​పీ వెబ్​సైట్​ను సందర్శించి మీ ఫోన్​ నంబర్​, మెయిల్​ ఐడీతో సైన్​అప్​ చేసుకోవాలి. అనంతరం పాస్​వర్డ్​ను ఎంటర్​ చేయాల్సి ఉంటుంది. మీ మెయిల్​ ఐడీకి ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత వివరాలను ఎంటర్​ చేయాలి. కొత్తగా నమోదు చేసుకునేవారు ఫారం-6లో వివరాలును ఎంటర్​ చేయాలి. అక్కడ అడిగిన డాక్యుమెంట్లను అప్​లోడ్​ చేయాలి. అప్లికేషన్​ స్టేటస్​ను కూడా ఇదే పోర్టల్​లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఫోన్​ నంబర్​, క్యాప్చా, ఓటపీ నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే సమయంలో మీకు వచ్చిన మెసేజ్​లోని సంఖ్యను స్టేటస్​లో ఎంటర్​ చేయాలి. అనంతరం దరఖాస్తు స్టేటస్​ తెలుస్తుంది.

“18 ఏళ్లు నిండిన వారంతా నూతన ఓటరు ఐడీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇదివరకే జారీ కార్డులో తప్పులుంటే సరి చేసుకోవచ్చు. కొద్ది రోజుల్లోనే కొత్త కార్డు వస్తుంది. యువత ఓటు హక్కు కోసం తప్పక దరఖాస్తు చేసి పొందాలిగాయత్రి, తహసీల్దార్, దౌల్తాబాద్

రియల్ టైమ్ట్రాకింగ్​ : ప్రస్తుతం ఓటర్లకు ఓటర్ ఐడీ కార్డులను అందడానికి 30 రోజులకు పైగా సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే, కొత్త వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయబోతున్నారు. ఈ కొత్త విధానంలో, ఓటర్ కార్డు తయారవడం నుంచి ఓటరుకు అందే వరకు ప్రతి దశలోనూ పర్యవేక్షించడం కోసం రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తెలిపింది. ఈ ప్రాసెస్​ను ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి పర్యవేక్షిస్తారు. అంతేకాక, ప్రతి దశలో ఓటర్లకు ఎస్ఎంఎస్(సంక్షిప్త సందేశం) ద్వారా సమాచారం అందేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా ఓటర్లు తమ ఓటర్ ఐడీ కార్డు స్థితిని తెలుసుకోవడానికి మరింత సులభతరమవుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top