RTC బస్సులో లగేజీ మర్చిపోయారా? – టెన్షన్ పడకండి – ఇలా ఈజీగా పొందండి – HOW TO FIND LOST LUGGAGE IN RTC BUS
ఇక నుంచి ఆర్టీసీ బస్సులో లగేజీ మర్చిపోతే నో టెన్షన్ – టికెట్ ఉంటే లగేజీ తీసుకునే సౌకర్యం
How To Find Lost Luggage in RTC Bus : ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ కీలకం. నిత్యం వేల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తారు. సంస్థ సైతం ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒక్కోసారి ప్రయాణికులు బస్సులో తమ వస్తువులు, లగేజీని మర్చిపోతుంటారు. కొన్నిసార్లు తీసుకున్నా కొన్ని బస్సులోనే మర్చిపోతుంటారు. అది ఎలా తీసుకోవాలో తెలియదు. బస్టాండ్‌లో అయితే ఫర్వాలేదు ఆర్టీసీ సిబ్బందికి అప్పగిస్తుంటారు. చిన్న ఏరియా బస్‌స్టాప్‌లో తీసుకోకుండా దిగితే దాన్ని మర్చిపోవాల్సిందే. ఎందుకంటే అది ఆర్టీసీ సిబ్బందికి చేరుతుందన్న నమ్మకం లేదు. అది కొన్ని సమయాల్లో తస్కరించే అవకాశముంటుంది. కానీ ఇప్పుడు దానికి ఆందోళ చెందాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ చేసి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇస్తే, మన లగేజీ భద్రంగా ఉంటుంది. అయితే టికెట్‌ను భద్రపరచుకోవాలి.
ప్రయాణికుడు తన లగేజ్ పోయింది అని నిర్ధారించుకున్న తర్వాత బస్సులో ఉన్న టికెట్ ఉందా లేదా అని చూసుకోవాలి. దానిపై బస్సు నంబర్, డిపో డ్రైవర్ ఐడీ నంబర్ తదితర వివరాలు ఉంటాయి. వాటి ద్వారా సంబంధిత డిపో మేనేజర్ లేదా అసిస్టెంట్ మేనేజర్లను సంప్రదించాలి. వారికి మీ లగేజీ పోయిందని వివరిస్తే వారు సంబంధిత బస్సు డ్రైవర్, కండక్టర్ నంబర్లను ఇస్తారు. వారికి ఫోన్ చేసి మీ లగేజీ ఏ సీటు వద్ద మర్చిపోయారో చెప్పాలి. వారు గుర్తించి దాన్ని డిపోకు భద్రంగా చేరవేస్తారు. మర్చిపోయిన ప్రయాణికుడు డిపోకు వెళ్లి సిబ్బందికి సమాచారం అందజేసి వాటిని పొందవచ్చు.
టికెట్ లేని సమయంలో ఏం చేయాలి? : ఒకవేళ ప్రయాణికుడి దగ్గర టికెట్ లేకపోతే, ఆ లగేజీ ఎవరూ తీసుకెళ్లకుంటే దాన్ని డిపోకు చేరుస్తారు. విధులు పూర్తయిన తర్వాత బస్సు డిపోకు చేరుకునే క్రమంలో సెక్యూరిటీ సిబ్బంధి బస్సును తనిఖీ చేస్తారు. మర్చిపోయిన వస్తువుల రికార్డునో నమోదు చేసి అధికారులకు అందిస్తారు. సదరు ప్రయాణికులు డిపోకు చేరుకుని వివరాలను తెలియజేస్తే వాటిని సరిచూసుకని డిపో మేనేజర్ సమక్షంలో తిరిగి అందజేస్తారు. ప్రయాణికులు బస్సుల్లో, లగేజీలు మర్చిపోతే సంబంధిత డిపోలో సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
బస్సు ఎక్కెటప్పుడు, దిగెటప్పుడు మరవొద్దు : ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయాల్లో ఈ ఘటనలు చోటుచేసుకుంటాయి. రద్దీ కారణంగా బస్సులు కిక్కిరిసిపోతుంటాయి. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయించి. వీకెండ్ వచ్చినా చిన్న చిన్న ట్రిప్పులకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయాల్లో బస్టాండ్లలో ఉండే రద్దీ గురించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. స్టాప్ వచ్చిందన్న తొందర్లో దిగిపోతుంటారు. వారి ఒకటి రెండింటి కంటే ఎక్కువ బ్యాగులు ఉంటే ఇదే జరుగుంది. కొన్నిసార్లు వారి లగేజీ మర్చిపోయారన్న విషయాన్ని ఆ హడావుడి త్వరగ గ్రహించలేరు. కాసేపటి చూసుకునే వరకు బస్సు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొన్ని సందర్భాల్లో బస్సు వచ్చిందన్న సీటు దొరుకుందో లేదో అన్న కంగారులో లగేజీని బస్టాప్‌లో మర్చిపోతుంటారు. తర్వత వారికేం చేయాలో తెలియదు. ఈ సమయంలో ఈ సౌకర్యం ఉపయోగపడనుంది.
డిపోల వారీగా సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు | |
వరంగల్-1 | 8500346902 |
వరంగల్-2 | 7382856056 |
హనుమకొండ | 8977781103 |
జనగామ | 7416063183 |
మహబూబాబాద్ | 8500324880 |
తొర్రూరు | 9989009327 |
పరకాల | 8978362217 |
నర్సంపేట | 7382926166 |
భుపాలపల్లి | 7382854237 |