విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ ఆన్లైన్లో శిక్షణ – రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
గ్రామీణ విద్యార్థుల కోసం ఐఐటీ మద్రాస్ స్కూల్ కనెక్ట్ పేరిట కొత్త కార్యక్రమం – పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్లో వివిధ కోర్సుల్లో శిక్షణ – రిజిస్ట్రేషన్‌కి జులై 25 వరకు అవకాశం.
IIT Madras Offers Online Training : దేశంలో ప్రతిష్ఠాత్మక ఐఐటీ విద్యాసంస్థలు ఎన్నో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల నుంచి చాలా మంది విద్యార్థులు ఈ సంస్థలలో చదువుతూ తమ భవిష్యత్తును రూపొందించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు వీటిల్లో ప్రవేశించడం కాస్త కష్టమే అవుతుంది. వారిని సైతం ఐఐటీల్లోకి అడుగు పెట్టించాలన్న లక్ష్యంతో ఐఐటీ మద్రాస్ స్కూల్ కనెక్ట్ పేరిట కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్లో వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనుండటం విశేషం.
నవతరం సాంకేతికతను అందిపుచ్చుకొని దూసుకెళ్లోంది. వారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా తాజాగా పది కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థి నచ్చిన కోర్సును ఎంచుకోవచ్చు.
ఐఐటీ మద్రాస్ అందిస్తున్న కోర్సులు : –
డాటా సైన్స్ – ఏఐ
ఎలక్ట్రానిక్ సిస్టమ్స్
ఆర్కిటెక్చర్-డిజైన్
ఇంజినీరింగ్ – బయోలాజికల్ సిస్టమ్స్
ఫన్ విత్ మ్యాథ్స్ – కంప్యూటింగ్
ఇంట్రాడక్షన్ టు లా
మ్యాథ్స్ అన్‌ప్లగ్‌డ్ గేమ్స్ – పజిల్స్
ఫండమెంటల్స్ అండ్ ఏరో స్పేస్
ఇంట్రాడక్షన్ టు ఎకాలజీ
హ్యుమానిటీస్ అన్‌ప్లగ్‌డ్
సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ శిక్షణపై ఆసక్తి చూపాయి.
ఎలా నమోదు చేసుకువాలంటే? : స్కూల్ కనెక్ట్ ఐఐటీ మద్రాస్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత పాఠశాల వివరాలు నమోదు చేయాలి. రెండు రోజుల తర్వాత యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది. దీని ఆధారంగా తదుపరి ప్రక్రియ పూర్తి చేయాలి. విద్యార్థులు కోర్సును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సులు మొదట బ్యాచ్ ఆగస్టులో ప్రారంభం అవుతుంది. రిజిస్ట్రేషన్‌కి చివరి తేది ఈ నెల 25 వరకు ఉంది.
పరీక్ష, ధ్రువపత్రం : –
విద్యా సంవత్సరంలో రెండు నుంచి మూడు బ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఆసక్తి మేర పాఠశాలలు అనుసంధానం కావోచ్చు. ఒక్కో విద్యార్థికి నామమాత్ర రుసుము రూ. 500 చెల్లించాలి. పేద కుటుంబాలకు సమాచారం లేని వారికి ఉపాధ్యాయులు సహకారం అందిస్తున్నారు. నిపుణులు బోధించనున్నారు. ఒక్కో విద్యార్థినికి వ్యక్తిగత లాగిన్స్ ఇవ్వనున్నారు. రికార్డు వీడియోలు అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత తరగతులు నిర్వహించాక, అసైన్‌మెంట్స్ (ప్రాజెక్టు) ఇవ్వనున్నారు. పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ అందిస్తారు. వివిధ ప్రవేశాల సమయంలో ప్రాధాన్యం ఇస్తారు.
ముందుకు ఇలా :
కొన్ని పాఠశాలలు అంతర్జాల సదుపాయాన్ని తీసుకుంటున్నాయి.
విపణిలో ఆధునిక, డిమాండ్ కలిగిన కోర్సులెన్నో ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం పలు జూనియర్ కళాశాలలు వినియోగించుకున్నాయి.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఐటీ వైపు అడుగేశాలా ఈ కోర్సుల ద్వారా తీర్చిదిద్దుతారు.
అనుసంధానమైన పాఠశాలలు : సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ధూల్మిట్ట, తొగుట మండలం వెంకట్రావుపేట, నారాయణరావుపేట, జక్కాపూర్, పెదారెడ్డిపేట జడ్పీ ఉన్నత పాఠశాలలు, కోహెడ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులం తదితర పాఠశాలలలు అనుసంధానం అయ్యాయి.
”ఆధునిక విజ్ఞానాన్ని అందించే అనేక రకాల కోర్సుల శిక్షణకు ఐఐటీ మద్రాస్ అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు ముందుకు రావాలి. కోర్సుల్లో చేరేలా గ్రామీణ ప్రాంత మరింత మందిని ప్రోత్సహిస్తున్నాం.” – కరుణాకర్‌రెడ్డి, గెజిటెడ్ హెచ్‌ఎం, ధూల్మిట్ట జడ్పీ ఉన్నత పాఠశాల.