India Post Scholarship 2025 – Apply Online

6–9 తరగతుల విద్యార్థులకు తపాలాశాఖ స్కాలర్‌షిప్ | ఆన్‌లైన్ దరఖాస్తు వివరాలు | India Post Scholarship 2025 Apply Online

Highlights

  1. 6–9 తరగతుల విద్యార్థులకు తపాలాశాఖ స్కాలర్‌షిప్ | ఆన్‌లైన్ దరఖాస్తు వివరాలు | India Post Scholarship 2025 Apply Online
    1. ముఖ్య వివరాలు (సంక్షిప్తంగా)
    2. ఎంపిక విధానం
    3. స్కాలర్‌షిప్ ప్రయోజనాలు

India Post Scholarship 2025: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మంచి వార్త. తపాలాశాఖ ఈ ఏడాది కూడా దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్ (Dean Dayal Sparsh Yojana Scholarship 2025) ను ప్రకటించింది. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆగస్టు 21 నుంచి India Post Scholarship 2025 online apply ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. విద్యార్థులు సెప్టెంబర్ 13, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా తపాలా బిళ్లల సేకరణ (Philately) ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

 ముఖ్య వివరాలు (సంక్షిప్తంగా)

వివరాలు సమాచారం
స్కాలర్‌షిప్‌ పేరు India Post Scholarship 2025 (Dean Dayal Sparsh Yojana)
అర్హత 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు
దరఖాస్తు ప్రారంభం ఆగస్టు 21, 2025
చివరి తేదీ సెప్టెంబర్ 13, 2025
ఎంపిక విధానం ప్రిలిమినరీ పరీక్ష + ప్రాజెక్ట్ వర్క్
స్కాలర్‌షిప్‌ మొత్తం నెలకు రూ.500 (ఏడాదికి రూ.6,000)

 ఎంపిక విధానం

ఈ స్కాలర్‌షిప్‌కి ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది:

  1. ప్రిలిమినరీ పరీక్ష– 50 ప్రశ్నలు (చరిత్ర, క్రీడలు, సామాజికశాస్త్రం, సైన్స్, జనరల్‌ నాలెడ్జ్, స్టాంపులు)
  2. ప్రాజెక్ట్ వర్క్– 16 స్టాంపులతో 4–5 పేజీల ప్రాజెక్ట్‌ తయారు చేసి పోస్టు ద్వారా రీజినల్‌ ఆఫీసుకి పంపాలి.

ఈ రెండు దశల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను హైదరాబాద్‌, విజయవాడ తపాలాశాఖ అధికారులు ఎంపిక చేస్తారు.

 స్కాలర్‌షిప్ ప్రయోజనాలు

ప్రతి తరగతి (6–9) నుంచి 10 మంది విద్యార్థులు ఎంపిక అవుతారు. అంటే మొత్తం 40 మందికి స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. ఎంపికైన వారికి నెలకు రూ.500 చొప్పున, ఏడాదికి రూ.6,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు.

 చివరగా…

India Post Scholarship 2025 ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించుకోవడంతో పాటు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది. ఫిలాటలీ అంటే స్టాంపుల సేకరణపై ఆసక్తి కలిగిన వారికి ఇది మంచి అవకాశం.

👉 మీరు అర్హులు అయితే వెంటనే India Post Scholarship online apply పూర్తి చేయండి.

👉 Application Form: Click Here

👉 Notification Pdf: CLick Here

👉 Official Web Site: Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top