INSPIRE MANAK AWARD REGISTRATION | Apply Now

 చిట్టి బుర్రలను ప్రోత్సహిస్తే అద్భుతాలే – ఇన్‌స్పైర్‌మనక్‌ పురస్కారాలకు అప్లికేషన్లు ప్రారంభం – INSPIRE MANAK AWARD REGISTRATION

Inspire Manak Award Registration Started : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి కలిగించేలా యంత్రాంగం దృష్టి పెట్టింది. పిల్లలను రేపటి శాస్త్రవేత్తలుగా మార్చేందుకు కేంద్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డులను అందజేస్తోంది. ప్రతిభ చూపిన వారు జాతీయ స్థాయి ప్రదర్శనలో పాల్గొంటారు.

ఉమ్మడి జిల్లాలో ప్రతి బడి నుంచి గరిష్ఠంగా ఐదు ప్రతిపాదనలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఒక విద్యార్థి పంపిన ప్రతిపాదన జాతీయ స్థాయి వరకు వెళ్తే తర్వాత సంవత్సరం తిరిగి పంపడానికి వీలు లేదు. ఏదేని కారణంతో ప్రదర్శన ఎంపిక కాకుంటే మరో ఆలోచనతో అదే విద్యార్థి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. https://www.inspireawards-dst.gov.in/ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. సెప్టెంబరు నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంది. ప్రదర్శనను నేరుగా చిత్రీకరించాల్సి ఉంటుంది. చిత్రాలు, దృశ్యాలు స్పష్టంగా కనబడేలా శ్రద్ధ చూపాలి.

పరిజ్ఞానాన్ని వెలికి తీసేందుకు దోహదం : ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్‌ స్కూల్​ విద్యార్థులు 2025-26 విద్యాసంవత్సరంలో నామపత్రాలు దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్​ విద్యార్థులు 10-17 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశముంది. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న పరిజ్ఞానాన్ని వెలికితీసేందుకు ఇన్‌స్పైర్‌ మనక్‌ దోహదపడనుంది. అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారు కొత్త పరికరాలు తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. అది వారికి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది.

ఉపాధ్యాయులే ప్రోత్సాహంతోనే ముందుకువిద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్‌ కార్యక్రమాలు ఉపయోగపడతాయని కామారెడ్డి జిల్లా సైన్స్ అధికారి సిద్ది రాంరెడ్డి తెలిపారు. నాణ్యమైన ప్రదర్శనల ఆవిష్కరణకు అవకాశం కలగనుందన్నారు. ఇన్‌స్పైర్‌ మనక్‌కి దరఖాస్తు చేసుకోవడానికి ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. మెరుగైన ప్రదర్శనల తయారీకి తోడ్పాటునందించాలని చెప్పారు. ఈ అవార్డు దక్కించుకున్న విద్యార్థులకు రాబోయే కాలంలో కూడా ఏవైనా చేయాలంటే సులభంగా ఉంటుంది.

ప్రాక్టికల్గా ప్రాజెక్టులను వివరిస్తూయూట్యూబ్​లో ఇటీవల చాలా వీడియోలు సైన్స్​కు సంబంధించిన వీడియోలు వస్తున్నాయి. చాలా మంది విద్యార్థులు వారికి చదువుల విషయంలో ఏ సందేహం వచ్చినా వీడియోలను ఫాలో అవుతున్నారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​ ద్వారా మేకింగ్ వీడియోలు చూసి ప్రాజెక్టులు చేస్తున్నారు. చిన్న చిన్న సందేహలకు కూడా చాలా వీడియోలు ఉంటాయి. అలాగే స్కూల్లో ప్రాక్టికల్​గా చేయించి చూపిస్తున్నారు. స్పెషల్​ క్లాసులు నిర్వహించి ప్రాజెక్టులు కండక్ట్​ చేస్తున్నారు. కాలేజీల్లో నిర్వహించే సైన్స్​ ఫెయిర్లకు తీసుకెళ్తున్నారు. దానివల్ల వారికి సైన్స్​ సంబంధించి అవగాహన పెరుగుతుంది. అలాగే వారికి సైన్స్​లో దేనిపై ఆసక్తి ఉందో వాటికి సంబంధించిన కోర్సులు ఇస్తున్నారు. దీనివల్ల వారికి భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా వారికి పాఠశాల యాజమాన్యాలు బాగా తోడ్పాటు అందిస్తున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top