One lakh clay Ganpati idols free in Hyderabad… distributed at 34 places.
హైదరాబాద్‌లో ఫ్రీగా లక్ష మట్టి గణపతి విగ్రహాలు… 34 చోట్ల పంపిణీ… ఎక్కడెక్కడంటే..?
హైదరాబాద్‌లో వినాయక చవితి వేడుకల కోసం సిద్దమవుతున్న ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలోని 34 చోట్ల పర్యావరణ అనుకూల మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేయనున్నట్టుగా తెలిపింది. ఏయే తేదీల్లో ఎక్కడెక్కడ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తారనే వివరాలు ఇలా ఉన్నాయి…
హైదరాబాద్‌లో వినాయక చవితి వేడుకల కోసం సిద్దమవుతున్న ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలోని 34 చోట్ల పర్యావరణ అనుకూల మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేయనున్నట్టుగా తెలిపింది. ఆగస్టు 24 నుంచి ఆగస్టు 26 మధ్య ఈ విగ్రహాలను పంపిణీ చేయనున్నట్టుగా పేర్కొంది. మొత్తంగా లక్ష విగ్రహాలు అందుబాటులో ఉన్నట్టుగా వెల్లడించింది. పీవోపీ విగ్రహాల వినియోగం తగ్గించడానికి 2017 నుంచి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్టుగా హెచ్‌ఎండీఏ గుర్తుచేసింది. మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల జల వనరులు పెద్దగా కాలుష్యం బారినపడవని పేర్కొంది. పర్యావరణాన్ని కాపాడేలా, ప్లాస్టిక్ వినియోగించకుండా ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా తెలిపింది.
విగ్రహాలను పంపిణీ చేసే స్థలాలు, తేదీలు…
- ఆరోగ్యశ్రీ – సైలెంట్ వ్యాలీ హిల్స్, జూబ్లీ హిల్స్; పంపిణీ తేదీ – ఆగస్టు 24
- రోడ్ నంబర్ 10, ఐఏఎస్ క్వార్టర్స్, బంజారాహిల్స్; పంపిణీ తేదీ – ఆగస్టు 24, 25
- కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రెన్స్, జూబ్లీహిల్స్; పంపిణీ తేదీ – ఆగస్టు 24, 25
- హిందూ న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర, గ్రీన్‌లాండ్స్, బేగంపేట; పంపిణీ తేదీ – ఆగస్టు 24, 25
- హైదరాబాద్ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ; పంపిణీ తేదీ – ఆగస్టు 25, 26
- బల్కంపేట ఎల్లమ్మ ఆలయం; పంపిణీ తేదీ – ఆగస్టు 24, 25
- టూప్స్ రెస్టారెంట్, జూబ్లీ హిల్స్; పంపిణీ తేదీ – ఆగస్టు 24
- జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్; పంపిణీ తేదీ – ఆగస్టు 24, 25
- మెహదీపట్నం రైతుబజార్; పంపిణీ తేదీ – ఆగస్టు 24
- శిల్పారామం, హైటెక్ సిటీ, మాదాపూర్; పిణీ తేదీ – ఆగస్టు 25,26
11.మెట్రో క్యాష్ అండ్ క్యారీ – కూకట్‌పల్లి;పంపిణీ తేదీ – ఆగస్టు 25,26
- శిల్పారామం, ఉప్పల్; పంపిణీ తేదీ – ఆగస్టు 25,26
- సికింద్రాబాద్ గణేష్ టెంపుల్; పంపిణీ తేదీ – ఆగస్టు 26
- హెచ్‌ఎండీఏ ఆఫీస్ – మైత్రీవనం/ స్వర్ణ జయంతి, అమీర్‌పేట; పంపిణీ తేదీ – ఆగస్టు 25,26
- ట్యాంక్‌బండ్; పంపిణీ తేదీ – ఆగస్టు 24
- సచివాలయం; పంపిణీ తేదీ – ఆగస్టు 25,26
- ఎన్టీఆర్ గార్డెన్; పంపిణీ తేదీ – ఆగస్టు 24
- ప్రియదర్శిని పార్క్ – సరూర్‌నగర్; పంపిణీ తేదీ – ఆగస్టు 24, 25
- రాజీవ్ గాంధీ పార్క్ – వనస్థలిపురం; పంపిణీ తేదీ – ఆగస్టు 25,26
- కుందన్‌బాగ్, ఐఏఎస్ కాలనీ, లైఫ్ స్టైల్ సమీపంలో, బేగంపేట; పంపిణీ తేదీ – ఆగస్టు 24,25
- దుర్గం చెరువు పార్క్ ఎంట్రెన్స్ గేట్; పంపిణీ తేదీ – ఆగస్టు 25,26
- మెల్కోటే పార్క్, నారాయణగూడ; పంపిణీ తేదీ – ఆగస్టు 25,26
23.వేదిక్ ధర్మ ప్రకాష్ స్కూల్, ఓల్డ్ సిటీ, సుధా సినీ థియేటర్ సమీపంలో; పంపిణీ తేదీ – ఆగస్టు 25,26
- భారతీయ విద్యాభవన్, సైనిక్‌పురి; పంపిణీ తేదీ – ఆగస్టు 25,26
- వాయుపురి రిక్రియేషన్ సెంటర్; పంపిణీ తేదీ – ఆగస్టు 24,25
- సఫిల్‌గూడ పార్క్; పంపిణీ తేదీ – ఆగస్టు 26
- మైండ్ స్పేస్ జంక్షన్, మాదాపూర్; పంపిణీ తేదీ – ఆగస్టు 25,26
- మై హోమ్ నవద్వీప సమీపంలో, మాదాపూర్; పంపిణీ తేదీ – ఆగస్టు 25,26
- తార్నాక కమర్షియల్ కాంప్లెక్స్; పంపిణీ తేదీ – ఆగస్టు 25,26
- ఇందు ఆరణ్య, బండ్లగూడ, నాగోల్; పంపిణీ తేదీ – ఆగస్టు 24,25
- మొబైల్ డిస్ట్రిబ్యూషన్; పంపిణీ తేదీ – ఆగస్టు 24
(a) ఎస్‌ఎంఆర్ వినయ్ మియాపూర్
(b) మై హోమ్ జ్యువెల్ పైప్‌లైన్ రోడ్, ఇతర గేటెడ్ కమ్యూనిటీలు
(c) ఇందు ఫార్చున్, సమీప ప్రాంతాలు, కూకట్‌పల్లి
(d) రాంకీ టవర్స్, ఐటీ డెలైట్, మాదాపూర్
(e) మలేషియా టౌన్‌షిష్ అండ్ కేపీహెచ్‌బీ
- మొబైల్ డిస్ట్రిబ్యూషన్ (రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్); పంపిణీ తేదీ – ఆగస్టు 26
(a) చైతన్య మహిళా మండలి
(b) డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హెచ్‌ఆర్‌డీ
(c) టెలికాం ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్
(d) సంస్కృతి టౌన్‌షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
- మొబైల్ డిస్ట్రిబ్యూషన్; పంపిణీ తేదీ – ఆగస్టు 24
హైదరాబాద్ జిందాబాద్
- హెచ్‌జీసీఎల్ ఆఫీస్; పంపిణీ తేదీ – ఆగస్టు 25