ORAL CANCER SYMPTOMS

తరచూ నోటి పుండ్లతో బాధపడుతున్నారా? – మీ బాడీలో ఆ సమస్య ఉండొచ్చట! – ORAL CANCER SYMPTOMS

మీలో లక్షణాలు కనిపిస్తున్నాయా? – నిపుణులు ఏమంటున్నారంటే?

Mouth Cancer Signs and Symptoms : చాలా మందికి నోటిలో తరచూ పుండ్లు ఏర్పడుతుంటాయి. అయితే కొన్ని రోజుల్లోనే చాలా మందిలో అవి తగ్గిపోతుంటాయి. బీకాంప్లెక్స్ లోపం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, ప్రమాదకరమైన నోటి క్యాన్సర్​ వల్ల కూడా ఇలా నోటిలో పుండ్లు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం చాలామంది ఖైనీ, గుట్కా, పాన్ మసాలా వంటివి నములుతూ ఉన్నారు. ముఖ్యంగా యువత ఈ మత్తు పదార్థాలకు బాధితులుగా మారుతున్నారు. ఈ అలవాట్లు చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల దీర్ఘకాలంలో నోటిలో పుండ్లు ఏర్పడతాయని, చివరకు అవి నోటి క్యాన్సర్​గా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు పొగాకు ఉత్పత్తులు తల, మెడ, ఊపిరితిత్తుల క్యాన్సర్​కు ప్రధాన కారణమని చెబుతున్నారు. మనదేశంలో 85-90% నోటి క్యాన్సర్​లు పొగాకు, మద్యం మొదలైన దురలవాట్లతోనే వస్తున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది.

నోటిలో పుండ్లు రావడం : సాధారణంగా నోటి క్యాన్సర్ అనేది పుండుగానే మొదలవుతుందని medlineplus అధ్యయనంలో పేర్కొంది. ఈ పుండ్లు రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఉంటాయని, అసౌకర్యంగా కూడా ఉంటుందని తెలిపారు. అయితే చాలా మంది ఈ నోటి పుండ్లను పెద్దగా పట్టించుకోకుండా, అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారని పేర్కొన్నారు. రెండు వారాలకు మించి ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

నోరు సరిగా తెరచుకోకపోవటంక్యాన్సర్ తీవ్రమైతే నోటి కండరాలు క్షీణిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో నోరు తెరవటం కష్టంగా ఉంటుందని వివరించారు.

మాట్లాడడంలో ఇబ్బందినోటిలో, గొంతు భాగంలో పుండ్లు రావడం వల్ల ఆహార పదార్థాలు నమలడం, మింగడం, మాట్లాడడంలో ఇబ్బందిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నోటి లోపలి భాగం, చిగుళ్లలో క్యాన్సర్ ఉన్నట్లయితే దంతాలు పదులై ఊడిపోతాయని తెలిపారు.

నోటి నుంచి రక్తం రావడం : నోటి క్యాన్సర్ బాధితుల్లో నోటిలో పుండ్లు ఏర్పడుతాయని, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

నోటిలో మచ్చలు : నోటిలో ఎరుపు లేదా తెలుపు రంగు మచ్చలు కూడా నోటి క్యాన్సర్ కు సంకేతమని mayoclinic అధ్యయనంలో పేర్కొంది. చిగుళ్లు, నోటి లోపల ఏదైనా పొడి లేదా గరుకుగా ఉన్న మచ్చలు ఉంటే సంబంధిత వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.

గొంతులో నొప్పిజలుబు, ఫ్లూ కాలంలో పదేపదే గొంతు నొప్పి రావడం ఒక సాధారణ సమస్య. కానీ, నిరంతరం గొంతులో నొప్పిగా ఉండటం, ఆహార పదార్థాలను మింగడంలో ఇబ్బందిగా అనిపించడం కూడా నోటి క్యాన్సర్​కి సంకేతమని nhs.uk అధ్యయనంలో తేలింది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మేలంటున్నారు.

మొద్దుబారటం : నోట్లో నాడులు దెబ్బతింటే నాలుక, దవడ వంటి భాగాల్లో స్పర్శ, రుచి కోల్పోయి మొద్దుబారినట్లు అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పొగాకు వాడకం : సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటివి తాగడం లేదా గుట్కా, ఖైనీ, జర్దా, పాన్ మసాలా వంటివి నమలడం నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని బాగా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. పొగాకులో ఉండే రసాయనాలు నోటిలోని కణాలకు హాని కలిగించి, వాటిని క్యాన్సర్‌గా మారేలా ప్రేరేపిస్తాయని హెచ్చరిస్తున్నారు.

మద్యపానం : అధికంగా మద్యం సేవించడం కూడా నోటి క్యాన్సర్‌కు ఒక ముఖ్యమైన కారణమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పొగాకు వాడకంతో కలిపి మద్యం సేవించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఆల్కహాల్ నోటిలోని కణాలను దెబ్బతీసి, క్యాన్సర్‌కు దారితీస్తుందని చెబుతున్నారు.

నోటి శుభ్రతఇది పరిశుభ్రంగా లేకపోవడం వల్ల దీర్ఘకాలంలో నోట్లో వాపు రావడం, ఈ సమస్య దీర్ఘకాలంలో క్యాన్సర్​కు దారితీస్తుందంటున్నారు నిపుణులు.

హ్యూమన్ పాపిల్లోమావైరస్(HPV) ఇన్ఫెక్షన్ : ఇది ఒక సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్. ఇది లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. HPVలోని కొన్ని రకాలు, ముఖ్యంగా HPV-16, నోటి, గొంతు క్యాన్సర్‌లకు కారణమవుతాయని తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ అనేది గొంతు వెనుక భాగంలో వచ్చే క్యాన్సర్‌లకు ప్రధాన కారణాలలో ఒకటని పేర్కొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top