PFRDA Assistant Manager Notification 2025 | పెన్షన్ శాఖలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
PFRDA Assistant Manager Notification 2025 పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. PFRDA ఆఫీసర్ గ్రేడ్ ‘ఎ’(అసిస్టెంట్ మేనేజర్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. జనరల్, ఫైనాన్స్, ఐటీ, లీగల్ మరియు ఇతర విభాగాల్లో మొత్తం 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
PFRDA Assistant Manager Notification 2025 Overview :
నియామక సంస్థ | పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(PFRDA) |
పోస్టు పేరు | ఆఫీసర్ గ్రేడ్ ‘ఎ’ (అసిస్టెంట్ మేనేజర్) |
పోస్టుల సంఖ్య | 40 |
దరఖాస్తులకు చివరి తేదీ | 06 ఆగస్టు |
జాబ్ లొకేషన్ | భారతదేశంలో ఎక్కడైనా |
జీతం | రూ.44,500 – రూ.89,150/- |
పోస్టుల వివరాలు :
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఆఫీసర్ గ్రేడ్ ‘ఎ’ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
స్ట్రీమ్ | ఖాళీలు |
జనరల్ | 28 |
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ | 02 |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | 02 |
రీసెర్చ్(ఎకనామిక్స్) | 01 |
రీసెర్చ్ (స్టాటిస్టిక్) | 02 |
యాక్చువరీ | 02 |
లీగల్ | 02 |
అఫీషియల్ లాంగ్వేజ్(రాజభాష) | 01 |
మొత్తం | 40 |
అర్హతలు :
PFRDA Assistant Manager Notification 2025ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు విభాగాలు | విద్యార్హతలు |
జనరల్ | ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (లేదా) బ్యాచిలర్స్ ఆఫ్ లా (లేదా) ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ (లేదా) ICAI నుంచి ACA /FCA లేదా ICSI నుంచి ACA/FCA లేదా ICMAI నుంచి ACMA/FCMA లేదా CFA |
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ | గ్రాడ్యుయేషన్ మరియు ICAI నుంచి ACA /FCA లేదా ICSI నుంచి ACA/FCA లేదా ICMAI నుంచి ACMA/FCMA లేదా CFA |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | CS/IT/ECE/EEEలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా MCA లేదా AI/ML స్పేషలైజేషన్ ఉన్న పీజీ |
రీసెర్చ్ (ఎకనామిక్స్ / స్టాటిస్టిక్స్) | ఎకనామిక్స్ / స్టాటిస్టిక్స్ / ఎకనోమెట్రిక్స్ / ఫైనాన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ |
లీగల్ | LLB – లా డిగ్రీ |
యాక్చువరీ | గ్రాడ్యుయేషన్ మరియు IAI యొక్క 7 కోర్ ప్రిన్సిపుల్స్ పేపర్స్ లో ఉత్తీర్ణత |
అఫీషియల్ లాంగ్వేజ్ (రాజ్ భాష) | MA(Hindi) With English in UG లేదా సంస్కృతం/ఇంగ్లీష్ /ఎకనామిక్స్/కామర్స్ లో హిందీని ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్స్ డిగ్రీ |
వయస్సు :
PFRDA Assistant Manager Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
PFRDA Assistant Manager Notification 2025 పోస్టులకు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
కేటగిరీ | అప్లికేషన్ ఫీజు |
General / OBC / EWS | రూ.1,000/- |
SC / ST / PwBD / Women | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
PFRDA Assistant Manager Notification 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.
- స్టేజ్-1 : ఆన్ లైన్ స్ట్రీనింగ్ టెస్ట్
- స్టేజ్-2 : మెయిన్ ఎగ్జామ్
- స్టేజ్-3 : ఇంటర్వ్యూ
జీతం వివరాలు :
PFRDA Assistant Manager Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది. నెలకు రూ.44,500 – రూ.89,150/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
PFRDA Assistant Manager Notification 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో కెరీర్ లింక్ పై క్లిక్ చేయాలి.
- రిక్రూట్మెంట్ విభాగంలో ఆఫీసర్ గ్రేడ్ ‘ఎ’(అసిస్టెంట్ మేనేజర్)-2025 పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభ తేదీ | 2 జూలై, 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 06 ఆగస్టు, 2025 |
స్టేజ్-1 ఆన్ లైన్ పరీక్ష | 06 సెప్టెంబర్, 2025 |
స్టేజ్-2 ఆన్ లైన్ పరీక్ష | 06 అక్టోబర్, 2025 |
స్టేజ్-3 ఇంటర్వ్యూ | తర్వాత తెలియజేస్తారు |
Notification | Click here |
Apply Online | Click here |