Rented house vs own house.. Which is better?

Rented house vs own house.. Which is better?.. What do the experts say!

అద్దె ఇల్లు vs సొంత ఇల్లు.. ఏది మంచిది?.. నిపుణులు ఏం చెబుతున్నారు!

సొంతూరు వదిలి నగరాలకు వచ్చి సెటిల్‌ అవ్వాలనుకున్న వారికి పెద్ద సమస్య ఇళ్లు. ఇలా వచ్చిన వారు ఏళ్ల తరబడి ఉద్యోగం చేసి డబ్బులు పోగు చేసి ఇళ్లు కట్టడమో, కొనడమో చేస్తుంటారు. మరి కొందరు బ్యాంక్‌ లోన్స్‌ తీసుకొని ఇళ్లు కడుతుంటారు. మరికొందరు డబ్బు ఇళ్లు కట్టి అప్పులు చేసుకునే బదులు అద్దెకు ఉండడం బెటర్‌ అనుకుంటారు. అయితే సొంతిల్లు కట్టుకోవడం మంచిదా.. లేక అద్దె ఇంట్లో ఉండడం మంచిదా ఒక సారి చూద్దాం పదండి.

మానవులుగా జన్మించిన వారికి కొన్ని ముఖ్యమైన అవసరాలు ఉంటాయి. అంటే, ప్రధాన అవసరాలు ఆహారం, దుస్తులు మరియు నివాసం. ఈ మూడు మానవ మనుగడకు ప్రధాన వనరులు. అందువల్ల, చాలా మంది తమ సొంత ఇల్లు కొనడానికి చాలా కష్టపడి పనిచేస్తారు . కొంతమంది సొంత ఇల్లు కొనలేక నెలవారీ అద్దె ఇంట్లో నివసిస్తుంటారు. ఈ పరిస్థితిలో, అద్దె ఇంట్లో నివసించడం లాభదాయకమా లేదా సొంత ఇల్లు కొనడం లాభదాయకమా అని వివరంగా పరిశీలిద్దాం .

అద్దె ఇల్లు vs. సొంత ఇల్లు – ఏది మంచిది?

చాలా మంది సొంత ఇల్లు కొనడానికి లేదా నిర్మించుకోవడానికి చాలా కాలం పాటు డబ్బు ఆదా చేసుకుంటారు. అలా పొదుపు లేకపోతే, వారు బ్యాంకు నుండి లోన్స్‌ తీసుకొని తమ సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. కానీ అప్పులు తీసుకొని తిప్పలు పడడం ఎందకనుకునే కొందరు అద్దె ఇల్లు సరిపోతుందని భావిస్తారు. రుణం తీసుకొని దానిపై వడ్డీ చెల్లించే బదులు, అద్దె ఇంటి నుండి పొదుపు చేసుకోవచ్చని వారు భావిస్తారు. కానీ అది తప్పుడు నిర్ణయం అని నిపుణులు అంటున్నారు.

అద్దె ఇంట్లో నివసించడం అనేది అనవసరమైన అప్పులు చేయకుండా.. మన వద్ద ఉన్న డబ్బుతో జీవించడానికి ఒక మంచి మార్గం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు అని నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాలిక అవసరాల కోసం, ఉద్యోగ మార్పుల సమయంలో మీరు ఒకటి లేదా రెండు సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండాల్సి వస్తే అది ఒకే.. కానీ మీ జీవితాంతం అద్దె ఇంట్లో ఉండటం అంటే పక్కవాళ్లను బ్రతికించినట్టే. మన డబ్బును వేస్ట్ చేసుకున్నట్టే. ఎందుకంటే మీరు ప్రతి నెలా ఇంటి అద్దెకు చెల్లించే డబ్బు మొత్తం ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఏళ్ల పాటు ఇలానే అద్దె చెల్లించుకుంటూ పోతే.. మీరు డబ్బును పొదుపు చేయలేరు.

అలా కాదని సొంత ఇల్లు కొనడం లేదా నిర్మించడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ చివరకు మనకు సొంత స్థలం అంటూ ఉంటుంది. మన పోయిన తర్వాత అది మన పిల్లకైనా దక్కుతుంది. మీరు పూర్తిగా చెల్లించి ఇల్లు కొన్నా లేదా నెలవారీ వాయిదాలు చెల్లించి ఇల్లు కొన్నా, కొన్ని సంవత్సరాల తర్వాత మీకు మీ స్వంత ఇల్లు ఉంటుంది. కానీ, అద్దె ఇంట్లో ఉండటం అలా కాదు, మీరు ఎన్ని సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉన్నా, ఎటువంటి ప్రయోజనం ఉండదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top