SUBHA GUPTA SERVICE TO BLINDS – Inspiration

శెభాష్​​ గుప్తా – నీ కథ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం

అంగవైక్యలాన్ని జయించి అత్మవిశ్వాసంతో సాగుతున్న సుభాష్‌ గుప్తామరెవరు తనలా కష్టపడొద్దని అంధులు, అనాధలను చేరదీసిన గుప్తాపిల్లలకి ఉన్నత విద్యనందించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సాహం

Subhash Gupta Services to Blind and Orphans : చిన్న లోపమున్నా ఎదుటువారితో పోల్చుకుని బాధపడుతుంటారు కొందరు. కానీ అందుకు భిన్నంగా అంగవైకల్యంతో సావాసం చేస్తూ అత్మవిశ్వాసంతో ఎందరికో బాసటగా నిలుస్తున్నారు సుభాశ్‌ గుప్తా. కళ్లు లేకపోతేనేమి ఎదుటి వారికి సాయం చేయాలనే సంకల్పంతో అంధులను, అనాథలను చేరదీసారు. పిల్లల్ని కంటే వారినే చూసుకోవాల్సి వస్తుందని సంతానం వద్దనుకున్న ఆయన ఇప్పుడు వందల మంది అభాగ్యుల జీవితాల్లో వెలుగు జ్యోతయ్యారు.

పిల్లలు చిన్న అంగవైకల్యంతో జన్మించినా ఎలాగైనా వదిలించుకోవాలనుకునే రోజులివి. అయినవారే కాదునుకుంటున్న సమాజంలో వందల మంది కళ్లు లేనివారికి అన్నీ తానై చూసుకుంటున్నారు మరో అంధుడు. నిజామాబాద్‌కు చెందిన సుభాష్‌ గుప్తా పుట్టుకతోనే అంధుడు. చదువుకోవాలని ఆసక్తి ఉన్నా తల్లిదండ్రుల ప్రోత్సాహం లేక ఇంట్లో నుంచి హైదరాబాద్‌కు వచ్చి కష్టపడి ఉన్నత చదువు అభ్యసించారు. 1992లో ఆంధ్ర బ్యాంకులో క్లర్క్‌ కం క్యాషియర్‌గా ఉద్యోగం వచ్చింది. 23 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి స్వచ్ఛంద విరమణ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా : చిన్నతనంలో తాను పడ్డ కష్టాలు మరెవరూ ఎదుర్కోవద్దనుకుని అంధత్వం ఉన్న యువతీ, యువకులను చేరదీసి అన్నీ తానే చూసుకుంటున్నారు. హైదరాబాద్‌ కర్మాన్‌ఘాట్‌లో ఉంటున్న గుప్తా అక్కడే వేర్వేరుగా వసతి గృహాలు ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పిస్తున్నారు. విద్యాభ్యాసం పూర్తిచేయించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. ఆయన వివాహం అనంతరం భార్యా శోభారాణితో కలిసి పిల్లల యోగక్షేమాలు చూసుకుంటున్నారు.

“1975లో హైదరాబాద్కు రావడం జరిగింది. అంధుల మధ్యనే పెరిగి చదువుకుని ఉద్యోగం సంపాదించాను. 2004లో అంధ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించాం. 2010లో అబ్బాయిలకు వసతి గృహం పెట్టాం. ప్రస్తుతం ఇక్కడ 15మంది పిల్లలున్నారు. ఇంతకు ముందు 30 మంది ఉండేవారు. మా వసతి గృహల నిర్వాహణకు తెలిసిన వారు దాతలుగా ముందుకోస్తారుసుభాశ్గుప్తా, అంధుల వసతి గృహాల నిర్వాహకుడు

పిల్లల్ని వద్దనుకున్న తమకు ఇప్పుడు వంద మంది పిల్లులున్నారని సుభాశ్​ గుప్తా ఆనందం వ్యక్తం చేశారు. ఖాళీ వేళల్లో అగరబత్తీలు, సుద్దముక్కల తయారీపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తమ ఆధ్వర్యంలో వందలాది మంది అంధులు ఉద్యోగాలు పొంది వివాహ జీవితంలో సంతోషంగా స్థిరపడ్డారని వెల్లడించారు. ఇప్పటివరకు 101 మందికి బ్యాంకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ‘వికలాంగుల వివాహ వేదిక’ ఏర్పాటు చేసి 50 జంటలను ఒక్కటి చేసినట్లు తెలిపారు.

అసిస్టెంట్మెనేజర్గా : సుభాష్ గుప్తా తీర్చిదిద్దిన యువతీ, యువకులు తమ గురువు బాటలో నడవాలని నిర్ణయించుకొని వీ ఫర్‌ యూ అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం అనాధలు, వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. తనకు తెలియనివారి సాయంతో ఆశ్రమానికి వచ్చి ప్రస్తుతం యూనియన్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ మెనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాని చిట్టెమ్మ తెలిపారు. ప్రస్తుత సమాజంలో దివ్యాంగులపై చిన్నచూపు ఉంటోందని, వారిని అంటరాని వాళ్లలా చూసే ధోరణి మారాలని సుభాశ్ గుప్తా కోరుతున్నారు. దివ్యాంగులను ప్రోత్సహిస్తే సాధారణ ప్రజల కంటే ఉన్నతంగా రాణిస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సుభాశ్​ గుప్తా ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఎలాంటి అవసరమున్నా వి ఫర్​ యూ సంస్థనే చూసుకుంటుందన్నారు. ఉద్యోగాలు చేస్తున్నవారందరు తన దగ్గరే చిట్టీలు వేస్తారని, దాని ద్వారా వచ్చే వడ్డీని వసతి గృహాల నిర్వహణకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top