BDL: భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో 212 ట్రైనీ ఇంజినీర్ పోస్టులు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) హైదరాబాద్ యూనిట్ ఒప్పంద ప్రాతిపదికన ఏపీ & తెలంగాణలోని విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఇంజినీర్, ఆఫీసర్, డిప్లొమా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జులై 17వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
BHARAT DYNAMICS LIMITED
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, హెచ్ఎర్, ఫైనాన్స్, బిజినెస్ డెవలప్మెంట్.
పోస్టు పేరు-ఖాళీలు
1. ట్రైనీ ఇంజినీర్: 100
2. ట్రైనీ ఆఫీసర్: 12
3. డిప్లొమా అసిస్టెంట్: 90
4. ట్రైనీ అసిస్టెంట్: 10
మొత్తం ఖాళీల సంఖ్య: 212
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 2025 ఆగస్టు 10వ తేదీ నాటికి 28 నుంచి 33 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు ట్రైనీ ఇంజినీర్, ఆఫీసర్ కు రూ.29,000 – రూ.38,000, అసిస్టెంట్, ట్రైనీ అసిస్టెంట్కు రూ.24,500- రూ.29,500.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 జులై 17.
దరఖాస్తుకు చివరి తేదీ: 2025 ఆగస్టు 10.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.