హామీ పత్రాలు లేకుండా ఉన్నత విద్యకు రూ.7లక్షలకు పైగా లోన్ – 15రోజుల్లో అప్రూవల్! – VIDYA LAKSHMI EDUCATIONAL LOAN
ఉన్నత విద్య చదవాలి అనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం సూపర్ లోన్ – అప్లై చేసిన 15రోజుల్లోనే అప్రూవల్ – ఎలాంటి హామీ లేకుండానే లోన్.
Vidya Lakshmi Loan For Higher Education : ఉన్నత చదువులు చదవాలని అందరికీ ఉంటుంది. కానీ ఆర్థిక స్థోమత అందరికీ ఒకేలా ఉండదు. అలాంటి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం విద్యాలక్ష్మి పథకం అండగా నిలుస్తోంది. విద్యార్థుల ఆర్థిక కష్టాలు తీర్చాలన్న ఉద్దేశంలో కేంద్ర వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఎలాంటి హామీ పత్రాలు లేకుండానే బ్యాంకు నుంచి రుణాలు పొందవచ్చు.
చదువు ఖర్చే కాకుండా మిగతా అన్ని కలిపి : చదువుకోవడానికి అయ్యే రుణం కోసం అభ్యర్థి బ్యాంకుల చుట్టూ తిరగకుండా దరఖాస్తు చేసిన పదిహేను రోజుల్లోనే తక్కువ వడ్డీతో మంజూరవ్వడం ‘పీఎం విద్యాలక్ష్మి’ ప్రత్యేకత. రుణం అవసరమైన విద్యార్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. మంజూరు చేసే రుణంలో చదువుకయ్యే ఖర్చులు మాత్రమే కాకుండా ట్యూషన్ ఫీజు, వసతి, రవాణా ఖర్చులన్నింటినీ కలుపుతారు. దరఖాస్తు ఫీజు, ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా ఏమీ ఉండవు.
విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.4 లక్షల లోపు ఉండాలి. ఒక్క విద్యార్థి ఒక్క దరఖాస్తు మాత్రమే పంపాలి. దరఖాస్తు స్థితి(స్టేటస్) విద్యాలక్ష్మి పోర్టల్‌లో బ్యాంకు అప్‌డేట్ చేస్తుంది. రుణం మంజూరైందీ.. లేనిది పదిహేను రోజుల్లో తేలిపోతుంది. అవసరమైన ధ్రువపత్రాలు లేకపోతే దరఖాస్తును అన్‌హోల్డ్‌లో పెడతారు. పోర్టల్‌లోని డాష్‌బోర్డులో చూసి విద్యార్థి లోన్ అప్లికేషన్ గురించి తెలుసుకోవచ్చు.
గడువు తేదీ ఏం ఉండదు : పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మెమోలు, చివరిసారిగా చదివిన కోర్సుకు సంబంధించిన ఉత్తీర్ణతా పత్రం, చేరబోయే కోర్సుకు చెందిన అడ్మిషన్ పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రుణానికి దరఖాస్తు చేయడం కోసం ఏడాది ముందు చదివిన కోర్సు పాసై ఉండాలి. మార్కులు, పర్సటేజీలతో అవసరం లేదు. విద్యార్థులు తమ అవసరం మేరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు తేదీ అంటు ఏమీ ఉండదు. కానీ ఏం చదవాలి అనుకుంటున్నారు, ఏ కాలేజీలో మీకు అడ్మిషన్ వచ్చింది, ఫీజు విషయాలు అన్ని పూర్తిగా ఉండాలి. అప్పుడే లోన్ సులువుగా వస్తుంది.
ఇంజినీరింగ్, టెక్నికల్, వృత్తి సంబంధమైన, ఎంబీబీఎస్, ఆర్కిటెక్చర్, లా, చార్టర్డ్ అకౌంటెన్సీ లాంటి ప్రొఫెషెనల్ కోర్సులు. అండర్ గ్యాడ్యుయేట్ (యూజీ) చదివే విద్యార్థులకు, విదేశాల్లో ఉన్నత విద్య చదివే వారికి రుణాలు మంజూరవుతాయి. విదేశీ కాలేజీల్లో చదివిన వారైతే ఆ కాలేజీ సీటుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి.
- మూడు రకాలుగా రుణం మంజూరు అవుతుంది. అంతా కాలేజీ ఫీజు మిగతా అన్ని పరిగణలోని తీసుకుని మంజూరు చేస్తారు.
- రూ.4 లక్షల లోపు, రూ.4 లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకు, రూ.7.5 లక్షల పైన
ఎలా అప్లై చేయాలి అంటే :
- ముందుగా www.vidyalakshmi.co.inవెబ్‌సైట్లోకి వెళ్లాలి.
- రిజిస్ట్రేషన్ ఆప్షన్ కనిపిస్తుంది.
- వెళ్లి పేరు, మొబైల్ నంబరు, ఈ మెయిల్ ఐడీ, చిరునామా తదితర వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి.
- అనంతరం కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫాం(సీఈఎల్‌ఏఎప్)ను పూర్తి చేయాలి.
- అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి.