What rank in AP EAMCET 2025 will get a seat in VRSE College?

AP EAMCET 2025 లో ఎంత ర్యాంకు వచ్చిన వారికి VR Siddhartha Engineering కాలేజీలో సీట్ వస్తుంది?. కేటగిరీల వారిగా కటాఫ్ ర్యాంక్స్ వివరాలు చూడండి.

AP EAMCET 2025:

ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, వారికి వచ్చిన ర్యాంక్స్ ఆధారంగా వారు కోరుకున్న కాలేజెస్ లో సీటు వస్తుందా లేదా అనే అనుమానం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా విజయవాడలోనే టాప్ కాలేజస్ లో ఒకటైనటువంటి “VR Siddhartha Engineering College ” లో సీట్ రావాలి అంటే క్యాటగిరీల వారిగా ఎవరికి అంతర్యాంకు వస్తే సీటు వస్తుందో గత సంవత్సరాల ర్యాంక్స్ ని ఆధారంగా చేసుకొని, మీకుపూర్తి సమాచారంతో కూడినటువంటి ఈ ఆర్టికల్ ని అందిస్తున్నాము. ఈ డేటా ఆధారంగా మీకు వచ్చినటువంటి ర్యాంక్స్ ద్వారా ఈ కాలేజీలో సీటు వస్తుందో లేదో అంచనా వేసుకోవచ్చు. తద్వారా కౌన్సిలింగ్ లో మీరు ఈ కాలేజీకి ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి సమాచారం చూడండి.

కాలేజీ వివరాలు:

  • కాలేజీ పేరు: VR Siddhartha Engineering College ( ఇప్పుడు ఇది Siddhartha Academy Of Higher Education, Deemed to be University)
  • అందించే బ్రాంచెస్ వివరాలు: ఈ కాలేజీ వారు అనేక బీటెక్ బ్రాంచెస్ ని ఆఫర్ చేస్తున్నాయి (CSE, ECE, IT, AI-ML, EEE, EIE, ME, CE)

CSE Branch – OC General అభ్యర్థులకు Expected ర్యాంక్ వివరాలు:

  • expected Closing rank for OC Boys & Girls: 6,300 – 6,400

ఇతర కేటగిరీల వారికి expected rank details:

Category Expected Ranks
OC_EWS 6700–6800, Girls: 5000–5100
BC A 7600–7800, Girls: 9500–9700
BC B Boys & Girls: 8400–8600
BC D Boys & Girls: 7000–7200
BC E Boys & Girls: 11800–12100
SC Boys & Girls: 18600–18900
ST Boys & Girls: 40500–41000

ఇతర బీటెక్ బ్రాంచ్ లు: expected cutoff ranks:

సాధారణ ఓసి క్యాటగిరి లో 2025 అంచనా కటాఫ్ ర్యాంకులు

Branch Expected cutoff ranks (OC)
ECE 6,000 – 10,000
IT 5,000 – 8,000
AIML 4,000 – 7,000
Data Science 5,000 – 8,000
Cyber Security 6,000 – 9,000
EEE 15,000 – 25,000
EIE 25,000 – 35,000
ME 20,000 – 30,000
CE 30,000 – 45,000

2024 రియల్ డేటా ప్రకారం – Trend అంచనా:

  • CSE Closing Rank (OC) : 3,804
  • ECE Closing Rank (OC) : 9,068
  • IT Closing Rank (OC) : 11,247
  • AIML Closing Rank (OC) : 11,348

విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు:

  1. డీమ్డ్ యూనివర్సిటీ: 2024 నాటికి VR Siddhartha Engineering College కి Deemed To Be University స్థాయికి వచ్చింది. అంటే స్వతంత్ర కౌన్సిలింగ్ మరియు SEEE ప్రవేశ పరీక్ష ఉంది.
  2. 2025 లో ఎంసెట్ పరీక్ష ద్వారా లేదా SEEE పరీక్ష ద్వారా అడ్మిషన్ ప్రక్రియలో ప్రతిపాదిత మార్పులు ఉంటే కాలేజ్ అధికారిక వెబ్సైట్ లేదా APSCHE ద్వారా నిర్ధారించుకోండి.

విజయవాడలోనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లోనే టాప్ ఇంజినీరింగ్ కళాశాలల్లో VR Siddhartha Engineering College చాలా ఉత్తమమైన కళాశాలగా చెప్పవచ్చు. కావున మీరు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సమయంలో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ కాలేజీకి సంబంధించినటువంటి బ్రాంచెస్ కి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ప్రధానికి ఇవ్వండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top